నిమ్మ జాతి( Lemon species ) తోటలకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో సిట్రస్ గ్రీనింగ్ తెగులు( Citrus greening rot ) కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగులు హెచ్ ఎల్ బి, పిల్ల పురుగులు, పెద్ద పురుగుల వల్ల సంక్రమిస్తుంది.
అంటు మొక్కల ద్వారా కూడా ఈ తెగులు పంటలకు వ్యాప్తి చెందుతుంది.విత్తనాల( seeds ) ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
గాయాలు, మొక్కల వల్ల కూడా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.కాబట్టి నిమ్మ తోటలను సాగు చేయడానికి ముందు కణజాలం యొక్క నమూనాలను లేబరేటరీలో పరీక్షించి, ఎటువంటి తెగులు లేని మేలు రకం విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకుని సాగు చేయాలి.
ఈ తెగుల లక్షణాలు ఎలా ఉంటాయంటే నిమ్మ ఆకులపై పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి క్రమంగా పసుపు రంగులోకి మారడం, మొక్క ఎదుగుదల ఆగిపోవడం, ఆకులు రాలిపోవడం, నిమ్మకాయ ఎదగకుండా పచ్చ రంగులోకి మారడం లాంటివి సిట్రస్ గ్రీనింగ్ తెగులు లక్షణాలుగా నిర్ధారించుకోవాలి.నిమ్మ తోటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పైన చెప్పిన తెగుల లక్షణాలు మొక్కలలో కనిపిస్తే వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేయాలి.పొలంలో పనిచేసిన తర్వాత పనిముట్లను పరిశుభ్రంగా చేసుకోవాలి.నిమ్మ చెట్ల మొదల వద్ద కలుపు ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.నీటి తడులు సాధారణ పద్ధతిలో పారించకుండా డ్రిప్ విధానం ద్వారా మొక్కలకు నీటిని అందిస్తే కలుపు సమస్య, ఇతర చీడపీడల బెడద చాలావరకు ఉండదు.
రసాయన పద్ధతిలో ఈ సిట్రస్ గ్రీనింగ్ తెగులను తొలి దశలోనే అరికట్టాలి.టెట్రా సైక్లిన్ ఆంటీ యాంటీబయాటిక్( Tetracycline is an antibiotic ) ను నిమ్మచెట్టు కాండానికి ఇంజక్ట్ చేయాలి.అయితే టెట్రాసైక్లిన్ అనేది పర్యావరణం పై దుష్ప్రభావం చూపిస్తుంది.
అత్యవసర పరిస్థితిలో అతి తక్కువ మోతాదులో ఈ యాంటీబయాటిక్ ఉపయోగించి తెగులను అరికట్టాలి.తెగులు వచ్చిన తర్వాత అరికట్టడం కంటే నిమ్మ పంట తోటలకు తెగులు రాకుండా ముందుగా చెప్పినట్లు ల్యాబ్ లలో పరీక్షించిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.