ర‌క్త‌దానం ప్ర‌యోజ‌నాలేంటి.. ఎవ‌రు చేయాలి? ఎవ‌రు చేయ‌కూడ‌దు?

సాధార‌ణంగా ర‌క్త‌దానం( blood donation) అంటే చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు.రక్త‌దానం వ‌ల్ల తాము వీక్ గా మారిపోతామ‌ని భావిస్తుంటారు.

 What Are The Benefits Of Blood Donation? Blood Donation, Blood Donation Benefits-TeluguStop.com

స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల ర‌క్త‌దానం చేయ‌డానికి దూరంగా ఉంటాయి.కానీ, ర‌క్త‌దారం వ‌ల్ల అనేక మంది ప్రాణాలను కాపాడ‌టంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

బ్ల‌డ్‌ను డొనేట్ చేసిన త‌ర్వాత శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది.ఇది అనవసరమైన రక్త కణాలను తొలగించి శరీరానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.అలాగే ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు(Heart Diseases) వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ట‌.అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

రక్తంలో ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటే గుండెకు ముప్పు పెరుగుతుంది.ర‌క్త‌దానం వ‌ల్ల ఆ ఎలిమెంట్స్ త‌గ్గుతాయి.

ఫ‌లితంగా హార్ట్ డిసీసెస్ కు కొంత‌మేర దూరంగా ఉండొచ్చు.

ర‌క్త‌దానం అనంత‌రం శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవ్వ‌డం ప్రారంభమవుతుంది.

ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.రక్తదానం చేయడం ద్వారా లివర్, లంగ్స్ వ్యాధుల (Liver and lung diseases)సంక్రమణ త‌గ్గుతుంద‌ని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

అంతేకాదండోయ్‌.ర‌క్త‌దానం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

ఇక‌పోతే ర‌క్త‌దానం ఎవ‌రు చేయాలి? ఎవ‌రు చేయ‌కూడ‌దు? అన్నది తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం.

Telugu Benefits, Tips, Heart Diseases, Latest-Telugu Health

ర‌క్త‌దానం చేయాలంటే 18-60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అయ్యుండాలి.కనీసం 50 కిలోల బరువు కలిగి ఉండాలి.ఆరోగ్యంగా ఉండాలి.

రక్తహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి.రక్తపోటు స్థాయిలు నార్మ‌ల్ గా ఉండాలి.హెమోగ్లోబిన్ లెవ‌ల్స్ కనీసం 12.5 g/dL ఉండాలి.అలాగే ఒకసారి రక్తదానం చేసిన తరువాత.మళ్లీ చేయడానికి పురుషులైతే 3 నెలలు, మ‌హిళ‌లైతే 4 నెలలు గ్యాప్ తీసుకోవాలి.

Telugu Benefits, Tips, Heart Diseases, Latest-Telugu Health

ఇక ర‌క్త‌దానం ఎవ‌రు చేయ‌కూడ‌దు అన్న‌ది కూడా తెలుసుకుందాం.గర్భిణీ లేదా పిల్లలకు పాలిచ్చే మహిళలు రక్తదానం చేయకూడదు.50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు, అవయవ మార్పిడి లేదా తీవ్ర గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ర‌క్త‌దానం చేయ‌కూడ‌దు.జ్వరం, ఫ్లూ, ర‌క్త‌హీన‌త‌ లేదా ఇతర తీవ్ర అనారోగ్యాలతో బాధ‌ప‌డుతున్న‌వారు, ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ర‌క్త‌దానం చేయ‌కూడ‌దు.

మత్తు పదార్థాలు లేదా మద్యం సేవించినవారు, ఆరు నెలల లోపు టాటూలు వేయించుకున్న‌వారు కూడా ర‌క్త‌దానం చేయ‌కూడ‌దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube