పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..

సోమవారం సాయంత్రం ఇండోర్‌లో( Indore ) ఓ వింత సీన్ కనిపించింది.పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్( Allu Arjun ), విలన్ ఫహద్ ఫాసిల్ ( Fahad Faasil )పాత్రలు గుర్తుకు వచ్చేలా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.

 Pushpa And Shekawat Duplicates In Public, Fuses Out Due To The Shock Given By Ha-TeluguStop.com

ఒకతను అచ్చం పుష్పలా, మరో వ్యక్తి పోలీస్ డ్రెస్ లో, గుండుతో షెకావత్ లా కనిపించారు.పుష్ప గెటప్‌లో ఉన్న వ్యక్తి అయితే, సినిమాలో అల్లు అర్జున్ చేసినట్టు మీసం తిప్పుతూ కనిపించాడు.

షెకావత్ వేషధారణలో ఉన్న వ్యక్తి బైక్ నడుపుతూ సిగరెట్ వెలిగించాడు.ఈ వింత ఘటనను చాలామంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.‘పుష్ప, షెకావత్ ఇద్దరూ కలిశారు’ అంటూ కామెంట్లు పెట్టారు.

అయితే వీరికి ఫ్యూజుల్‌ ఔటయ్యే ఒక షాక్ తగిలింది.

షెకావత్ లా కనిపించిన వ్యక్తి నిజానికి పోలీసు కానిస్టేబుల్, అతడి పేరు జితేంద్ర తన్వర్.పోలీస్ రేడియో ట్రైనింగ్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు.

ఈ ఘటన పోలీస్ శాఖ దృష్టికి వెళ్లడంతో, అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఎందుకంటే, అతను విధుల్లో ఉండి నిబంధనలు ఉల్లంఘించాడు.

ఇంకా, ఆ ఇద్దరికీ హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు జరిమానా విధించారు.అంతేకాదు, బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగినందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా జరిమానా వేశారు.సరదాగా మొదలైన ఈ వ్యవహారం చివరకు సీరియస్ అయి, అధికారుల చర్యలతో ముగిసింది.

మొత్తానికి, పుష్ప, షెకావత్ వేషాలు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.ఒకవైపు వినోదం, మరోవైపు నిబంధనల ఉల్లంఘన.ఈ ఘటన ఇండోర్‌లో చర్చనీయాంశంగా మారింది.

పోలీసులైనా సరే నిజ జీవితంలో సినిమాలో లాగా షో ఆఫ్ చేస్తే దూల తీరిపోతుంది అని కొంతమంది సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube