విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.( Sankranthiki Vasthunnam ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి బాగా గుర్తింపు దక్కింది.
ఫుల్ పక్క ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలిచింది.ఇకపోతే ఈ సినిమాలో బాగా హైలైట్ అయింది మాత్రం బుల్లి రాజు( Bulliraju ) అనే చిన్న పిల్లవాడు చేసిన కామెడీ అని చెప్పాలి.
ఓటీటీలు చూసి పాడైపోయి, కనిపించిన ప్రతి వాడి మీద బూతుల వర్షం కురిపించే పిల్లాడిగా రేవంత్( Revanth ) అనే అబ్బాయి అదరగొట్టేశాడు.
గోదావరి స్లాంగ్ లో అతను చెప్పిన డైలాగులకు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి.కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పాలి.అయితే పిల్లవాడి యాక్టింగ్ కొందరు మెచ్చుకుంటుండగా ఆ పాత్ర విషయంలో కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.
అంత చిన్న పిల్ల వాడితో అలాంటి పెద్ద బూతులు తిట్టించడం సరైనది కాదు అలా బూతులు చెప్పించి సొసైటీ కి ఏం సందేశం ఇస్తున్నారు అన్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా తలెత్తుతున్నాయి.ముఖ్యంగా సినిమాలో మా నాన్న చేసింది మా అమ్మతోనే కదా ఏదో మీ పెళ్ళాలతో చేసినట్టు బిల్డప్ ఏంటి అంటూ చెప్పే డైలాగ్ పై భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పాత్రను చూసి పిల్లలు ఇన్‌స్పైర్ అయితే ప్రమాదం కదా అని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఈ విషయంపై స్పందించాడు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.బుల్లిరాజు పాత్రకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఆ కామెడీని అందరూ సరదాగా తీసుకుంటున్నారు.ఎంజాయ్ చేస్తున్నారు.కానీ ఈ పాత్ర విషయంలో విమర్శలు నా దృష్టికి వచ్చాయి.మా ఫ్రెండ్స్ కూడా కొందరు పిల్లాడితో అలా బూతులు చెప్పించడం ఏంటి అని అడిగారు.
కానీ మేం ఆ పాత్రతో చిన్న సందేశం ఇచ్చాము.పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఓటీటీలో కంటెంట్ చూస్తే వాటికి ఎక్కువ అలవాటు పడితే ఎంత ప్రమాదం అన్నది చూపించాము.
ఇంగ్లిష్, హిందీ వెబ్ సిరీస్ లకు తెలుగు అనువాదాలు చూశారంటే దారుణమైన బూతులు ఉంటాయి.వాటిని విని తట్టుకోలేం.
అలాంటివి పిల్లలు చూడకూడదని చెప్పడమే మా ఉద్దేశం.సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో చెప్పే యాడ్ లో కూడా సిగరెట్ తాగినట్లు చూపిస్తారు.
అంత మాత్రాన అది సిగరెట్ ప్రమోషన్ కాదు.అలాగే మేం కూడా ఈ పాత్రలో చెడును చూపిస్తూ చిన్న సందేశం ఇచ్చాం అని అనిల్ వివరించాడు.
హీరో వెంకటేష్ సైతం ఈ వాదనను సమర్థించాడు.అనిల్ రావిపూడి సమాధానం తో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అయింది.