టాలీవుడ్ మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు చెర్రీ.ఇకపోతే రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్.
( Game Changer Movie ) శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ ని మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా 100 కోట్ల వరకు మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.
అయితే చరణ్ కి ఉన్న చాలా పేర్లలో మిస్టర్ బాక్సాఫీస్ అనేది కూడా ఒకటి.అలాగే నటుడు పరంగా కూడా తనపై మంచి ఫీడ్ బ్యాక్ టాప్ దర్శకుల్లో ఉంది.ఇలా అప్పట్లోనే చరణ్ సత్తా చూసాను అంటూ జక్కన్న రాజమౌళి చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రామ్ చరణ్ తో రాజమౌళి చేసిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మగధీర( Magadheera ) మూవీ కోసం తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.
మరి ఈ సినిమా రిలీజ్ అయ్యిన ఏడాది తర్వాత 2010 లో చేసిన తన పోస్ట్ ని ఫ్యాన్స్ ఇపుడు డిగ్ చేశారు.ఈ విషయం గురించి రాజమౌళి ట్వీట్ చేస్తూ.
దీనిలో భారీ బడ్జెట్ తాము పెట్టిందే చరణ్ కోసం అని,నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.నిజానికి చిరంజీవి గారికి సబ్జెక్ట్ చాలా పెద్దది కావడం వల్ల ఎక్కడో కొంచెం అనుమానం పడ్డారు అని తెలిపారు.దీనితో అప్పట్లోనే చరణ్ పొటెన్షియల్ పట్ల రాజమౌళి ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.ఈ సందర్భంగా జక్కన్న చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ప్రస్తుతం చెర్రీ అభిమానులు తదుపరి సినిమాల అప్డేట్ ల కోసం ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.