సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి ఒకటి.అయితే అరటి మనకు పండ్ల రూపంలోనే కాకుండా కాయల రూపంలోనూ లభిస్తుంటాయి.
అరటికాయ తో రకరకాల కూరలు తయారు చేస్తుంటారు.అరటికాయ (Banana )తో తయారు చేసే ఫ్రై, గ్రేవీ కర్రీ వంటి వాటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.
అయితే రుచి పరంగానే కాదు పోషకాల పరంగానూ అరటికాయ ఆహా అనిపిస్తుంది.అరటికాయ లో కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్, విటమిన్స్, ఫైబర్, అమైనో యాసిడ్స్ తో సహా వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి.

అందువల్ల అరటికాయ ( Banana )ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే అరటి పండ్ల మాదిరిగానే అరటికాయల్లో కూడా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఈ కారణం వల్ల మధుమేహం ఉన్నవారు అరటికాయలను దూరం పెడుతుంటారు.అసలు మధుమేహం ఉన్నవారు అరటికాయ తినొచ్చా అంటే.నిశ్చింతగా తినొచ్చు.పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అరటికాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది.
అందువల్ల అరటికాయ తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి అన్న భయం అక్కర్లేదు.అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి అరటికాయ సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
అరటికాయ వంటలను వారంలో రెండు సార్లు కనుక తీసుకుంటే అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది. మలబద్ధకం సమస్యను ( Constipation problem )తరిమి కొడుతుంది.
అరటికాయలో ఉండే పలు సమ్మేళనాలు కడుపుని శుభ్రపరుస్తాయి.పెద్దప్రేగు, జీర్ణ అవయవాల నుంచి వ్యర్థాలను, టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి.

అంతే కాకుండా అరటికాయల్లో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.కీళ్ల నొప్పులను నివారిస్తుంది.అరటికాయలో పొటాషియం కూడా ఉంటుంది.ఇది అధిక రక్తపోటు( High blood pressure) సమస్యను నివారిస్తుంది.అరటికాయలోని పోషకాలు కంటి చూపును పెంచుతాయి.ఇన్ని ఆరోగ్య లాభాలు అందాలంటే అరటికాయను సక్రమంగా తీసుకోవాలి.
బాగా వేయించి లేదా చిప్స్ రూపంలో తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉండవు.ఉడికించి తక్కువ ఉప్పు తక్కువ నూనెతో వండుకుని తినాలి.







