ఒక సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు.కథ, డైలాగులు, కామెడీ ఇలా సినిమాలోని ముఖ్య భాగాల విషయాలలోనే కాకుండా తారాగణం ఎంపికలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి.
అంతేకాకుండా, సినిమా కథను ప్రతిబింబిస్తూనే ఆకట్టుకునే టైటిల్ ఖరారు చెయ్యాలి.అంతటితో సరిపోదు.
హీరో హీరోయిన్ల పేర్లను కూడా వారి క్యారెక్టర్ కు తగినట్లుగా పెట్టాలి.అయితే 8 మంది డైరెక్టర్లు మాత్రం తమ సినిమాలలోని హీరోయిన్ల పేర్లను రిపీట్ చేశారు.
వారెవరో, రిపీట్ అయిన ఆ పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
• విక్రమ్ కే కుమార్ – ప్రియ
విక్రమ్ కే కుమార్ ( Vikram K Kumar )తాను డైరెక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్‌లో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ క్యారెక్టర్ నేమ్ ను ప్రియాగా పెట్టాడు.
ఆ తర్వాత హలో మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ క్యారెక్టర్ నేమ్‌ను, మనంలోని సమంత పేరును, 24 సినిమాలోని నిత్యా మీనన్ నేమ్‌ను, ఇష్క్ లో నిత్యా మీనన్ నేమ్‌ను ప్రియాగానే ఎంచుకున్నాడు.
• కృష్ణవంశీ – మహాలక్ష్మి
కృష్ణ వంశీ( Krishna Vamsi ) డైరెక్షన్‌లో వచ్చిన “నిన్నేపెళ్లాడతా”లో టబు క్యారెక్టర్ నేమ్ మహాలక్ష్మి కాగా “చందమామ”( Chandamama ) సినిమాలోనూ కాజల్‌కి అదే పేరు పెట్టారు.
• రాజమౌళి – ఇందు
రాజమౌళి ( Rajamouli )తాను తీసిన సింహాద్రి మూవీలో భూమిక పాత్రకు ఇందు అని పేరు పెట్టాడు.సై, మగధీర సినిమాలలోని హీరోయిన్ రోల్స్ కు కూడా అదే పేరు పెట్టాడు.

• త్రివిక్రమ్ శ్రీనివాస్ – వల్లి, సునంద
త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) సన్నాఫ్ సత్యమూర్తి, అఆ సినిమాలో హీరోయిన్ పాత్రల పేర్లను వల్లిగా ఎంచుకున్నాడు.అత్తారింటికి దారేది, అరవింద సమేత వీర రాఘవ సినిమాల్లో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్‌కి సునంద అనే నేమ్ పెట్టాడు.
• కరుణాకరన్ – నందిని
కరుణాకరన్ ( Karunakaran )తన డార్లింగ్, చిన్నదాన నీకోసం, తేజ్ ఐ లవ్ యు సినిమాల్లో హీరోయిన్ పాత్ర పేరును నందినిగా సెలెక్ట్ చేసుకున్నాడు.

• వివి వినాయక్
వివి వినాయక్( V V Vinayak ) చెన్నకేశవరెడ్డి, అఖిల్, కృష్ణ, బన్నీ, బద్రీనాథ్, ఖైదీ నెంబర్ 150, ఇంటలిజెంట్ సినిమాలు తప్ప మిగిలిన అన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్ర పేరును నందినిగా ఎంచుకున్నాడు.
• శ్రీను వైట్ల – శ్రావణి, పూజ
శ్రీను వైట్ల( Srinu Whitela ) తన వెంకీ, కింగ్ సినిమాల్లో హీరోయిన్ పేర్లను శ్రావణిగా రిపీట్ చేశాడు.ఆయన తీసిన ఢీ, రెడీ, నమో వెంకటేశ, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల్లో హీరోయిన్ పాత్ర పేరు పూజ.

• పూరి జగన్నాథ్ – చిత్ర, సంజన
పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఆంధ్రావాలా, బిజినెస్ మాన్ సినిమాల్లో హీరోయిన్ పేరును చిత్రగా ఎంచుకున్నాడు.143, చిరుత సినిమాల్లో సంజన పేరు రిపీట్ చేశాడు.