సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో ప్రేమలు ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటారు.అదే విధంగా మధ్య తరగతి కుటుంబాల్లోనే భర్త పై భార్య, భార్యపై భర్త ఎంతో అనురాగంతో ఉంటూ ఉంటారు.
ప్రతిరోజూ భర్త కోసం లేదా కుటుంబం కోసం భార్య వంట చేసి పెడుతుంది.అలాగే వారికి కావలసిన అన్ని అవసరాలు కూడా తీర్చుతూ ఉంటుంది.
ఇది సాధారణ మహిళలకు వర్తిస్తుంది కానీ సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది అంటే నమ్ముతారా ? సినిమా వారి జీవితాల్లో అన్ని అడగగానే కళ్ళ ముందుకి కాళ్ళ ముందుకి వచ్చేస్తూ ఉంటాయి.అయినా కూడా తామే అన్ని సమకూరుస్తే తమ భర్తలపై ఉన్న ప్రేమ అని ఒప్పుకోక తప్పదు.
అలా ఒక భార్య బిజినెస్ లో ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ తన భర్త కోసం రోజు ప్రతి అవసరం దగ్గరుండి తీర్చడానికి ఇష్టపడుతుంది అంటే అది ఆమె భర్త పై ఉన్న ప్రేమ అని చెప్పాల్సిందే.ఇందుకు ఉదాహరణగా మంచు వెరోనికా గురించి చెప్పుకోవచ్చు. మంచు విష్ణు వైఎస్ఆర్ కుటుంబం నుంచి వెరోనికా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి నలుగురు పిల్లలు.అయితే వెరోనికా చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది ఆయన కూడా ప్రతిరోజు భర్తకి, పిల్లలకి ఏం కావాలో తనే దగ్గరుండి మరి చూసుకుంటూ వంట కూడా చేసి పెడుతుందట.ఆమె తలుచుకుంటే వందల పని వాళ్ళను పెట్టుకోగలడు కానీ అలా చేయదు తన భర్త ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తింటారు, అతనికి ఏమి ఇష్టం అనే విషయాలు అన్నీ కూడా ఆమె దగ్గర ఉండి చూసుకుంటుందట.
ఇక విష్ణు సైతం ఫ్యామిలీ మ్యాన్ గానే మనం అనుకోవచ్చు.సాయంత్రం అయిందంటే ఇంటికి వెళ్ళిపోతాడు.బయట ఏ విషయాలతో అతనికి సంబంధం ఉండదు.కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదు అంటాడు మంచు విష్ణు.తన పిల్లలు, భార్య మాత్రమే తన జీవితం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు.ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపారు మంచు విష్ణు.
ఇక విష్ణు మరియు వెరోనికా మేడ్ ఫర్ ఈచ్ అదర్ మాత్రమే కాదు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని కూడా అంటుంది మంచు లక్ష్మి.ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో వెరోనికా గొప్పతనం గురించి చెప్పింది.
ఇంతలా ప్రేమించే భార్య దొరకడం మంచు విష్ణు అదృష్టం అని కూడా అంటోంది లక్ష్మి.