ఫూల్ మఖనా( Fool Makhana ) తినడం వలన శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ ఫూల్ మఖనాతో చిరుతిళ్లు, కూరలను కూడా తయారు చేస్తూ ఉంటారు.
అలాగే ఇందులో ప్రోటీన్( Protein ), కోసం ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది.ఇక అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆకలి ఎక్కువగా ఉంటే ఈ మఖన తీసుకోవడం వలన కడుపునిండుగా ఉన్న భావన కలుగుతుంది.
అయితే ఫూల్ మఖనాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.దీన్ని తీసుకోవడం వలన సులభంగా బరువు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
అంతేకాకుండా దీని వలన నరాల పనితీరు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో మెగ్నీషియం( Magnesium ) కూడా ఉంటుంది.వీటిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.ఇక ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది.
ఇక ప్రతిరోజు వీటిని తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు, వాపులు లాంటివి తగ్గుతాయి.ఇక గుండె పనితీరు మెరుగుపరచడంలో కూడా ఎంతగానో మేలు చేస్తుంది.
మెగ్నిషియం, గల్లిక్ యాసిడ్స్ ( Gallic acids )ఉండడం వలన గుండెపోటు లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది.ఇక రక్తహీనత సమస్యను కూడా దూరం చేయడంలో ఫూల్ మఖనా ఎంతగానో సహాయపడుతుంది.

ఇక కిడ్నీలోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను కూడా తగ్గిస్తాయి.కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా కూడా ఫూల్ మఖనా కాపాడుతుంది.ఈ విధంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఫూల్ మఖనా పిల్లలకు కూడా పెట్టవచ్చు.ఎందుకంటే ఫూల్ మఖనాలో మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి.అయితే వీటిని పిల్లలకు పెట్టడం వలన పిల్లల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి.దీంతో కర్రీలు చేయడంతో పాటు స్మూతీ లాంటివి చేసుకొని కూడా తాగడం వలన మంచి జరుగుతుంది.







