Hair Fall White Hair : జుట్టు రాలడం మరియు అకాల తెల్ల జుట్టును నిరోధించడానికి ఉత్తమ రెమెడీ ఇదే!

పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, రసాయనాలతో కూడిన కేశ ఉత్పత్తులు వాడటం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల చాలా మంది హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను ఎదుర్కొంటున్నారు.

అలాగే కొందరు అతి చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్య బారిన పడుతున్నారు.

అయితే జుట్టు రాలడం మరియు అకాల తెల్ల జుట్టును నిరోధించడానికి ఒక ఉత్తమ రెమెడీ ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చిన్న కప్పు ఆవ నూనె( Mustard Oil ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్( Amla Powder ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి కనీసం ఐదు నిమిషాల పాటు స్పూన్ తో తిప్పుతూ ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

Advertisement

పూర్తిగా కూల్ అయ్యాక తయారుచేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అత్యంత సహజమైన మార్గం ఇది.ఆవ నూనె, ఆమ్లా పౌడ‌ర్‌, కాఫీ పౌడ‌ర్ మ‌రియు ప‌సుపులో విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.ఇవి ఈ జుట్టును మూల‌ల నుంచి బ‌లోపేతం చేయ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.

చుండ్రు, దురద, స్కాల్ప్ చికాకు వంటి పరిస్థితుల నుండి ఉపశమనం పొందడంలో తోడ్ప‌డ‌తాయి.జుట్టులో మెల‌నిన్( Melanin ) ఉత్ప‌త్తి త‌గ్గ‌కుండా అడ్డ‌క‌ట్ట వేస్తాయి.వారానికి ఒక‌సారి ఈ రెమెడీని పాటించడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను సుల‌భంగా వదిలించుకోవచ్చు.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా? 
యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   

అలాగే అకాల తెల్ల జుట్టు సమస్యకు సైతం దూరంగా ఉండవచ్చు.ఒకవేళ మీకు ఆల్రెడీ తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయినా కూడా మీరు ఈ రెమెడీని పాటించ‌వ‌చ్చు.

Advertisement

ఇది తెల్ల జుట్టును మళ్ళీ నల్లగా మారుస్తుంది.

తాజా వార్తలు