ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారంలో స్పీడ్ పెంచారు.శుక్రవారం కైకలూరు, గిద్దలూరు సభలలో పాల్గొని సాయంత్రం నెల్లూరు నగరంలో( Nellore ) కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించడం జరిగింది.
నెల్లూరులో ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు.ఇదేనగరంలో దర్గా మీఠా లోని.
సెయింట్ జోసెఫ్ స్కూల్, పిఆర్సిలో చదువుకున్నట్లు వెల్లడించారు.ఆ సమయంలో రెండు అంశాలు నేర్చుకున్నాను.
ఆ రెండు అంశాలు పార్టీ పెట్టడంలో సహాయపడినట్లు తెలిపారు.ఒకటి దేశభక్తి, రెండవది పుచ్చలపల్లి సుందరయ్యలా బయటకు వచ్చి.
ప్రశ్నించటం.
నెల్లూరులో ఫతేకాన్ పేట, మూలపేట, సంతపేట, రంగనాయకుల పేటలో తిరిగినట్లు వెల్లడించారు.నెల్లూరులో కూటమి అభ్యర్థులు నారాయణ,( Narayana ) వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) లను గెలిపించాలని ప్రజలను పవన్ కోరారు.ఓటు వేసేటప్పుడు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి అని వ్యాఖ్యానించారు.
గుండా ప్రభుత్వానికి మనం భయపడాలా.? ఆత్మగౌరవాన్ని తీసేసి వ్యక్తులకు మనం భయపడతామా.? వైయస్ జగన్ కి( YS Jagan ) మనం భయపడతామా.? అందరూ ధైర్యంగా ఉండండి.ఎన్నికలలో మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి అని పవన్ కోరారు.సింహపురి ఇది… గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురుతిరిగే సింహపురి ఇది.ఎవరు పారిపోవాల్సిన అవసరం లేదు.మన హక్కుల కోసం పోరాడదాం… బలంగా నిలబడదాం… మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా… అవినీతి కోటలు బద్దలు కొడదాం అని పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.