యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పార్లమెంటుకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ హనుమంత్ కే.జెండగే తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్ అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తిచేయడం జరిగిందని తెలిపారు.భువనగిరి పార్లమెంట్ స్థానానికి 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున రెండు అదనపు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు చేయడం జరిగిందని,
అందులో భాగంగా భువనగిరి అసెంబ్లీ సెగ్మెంటుకు అదనంగా 642 బ్యాలెట్ బాక్సులు, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి అదనంగా 772 బ్యాలెట్ బాక్సులు కేటాయించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.







