బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా హైపర్ ఆది( Hyper Adi ) తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడనే సంగతి తెలిసిందే.హైపర్ ఆది జనసేన పార్టీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ సక్సెస్ కోసం తమ వంతు కష్టపడ్డారు.
అయితే జనతా గ్యారేజ్ ఫేమ్ దీపు నాయుడు( Deepu Naidu ) ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
దీపు నాయుడు, హైపర్ ఆది జోడీ గురించి కొన్ని రూమర్స్ రాగా ఆ రూమర్స్ గురించి దీపు నాయుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
హైపర్ ఆది తనకు మంచి ఫ్రెండ్ అని సరదాగా తనను ఫ్లర్ట్ చేస్తాడే తప్ప మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేశారు.హైపర్ ఆది నాకు ప్రొఫెషనల్ గానే పరిచయం అయ్యాడని దీపు నాయుడు పేర్కొన్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీలో( Sridevi Drama Company ) హైపర్ ఆదితో కలిసి స్కిట్ చేశానని అప్పటినుంచి మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఏర్పడిందని ఆది నన్ను ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడని నాతో రీల్స్ చేస్తుంటాడని ఆమె తెలిపారు.నేను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదని నీకోసం చేస్తున్నానని చెప్పేవాడని ఆమె వెల్లడించారు.మొదట్లో ఆది తీరు నాకు నచ్చలేదని ఇప్పుడు ఆది నాకు మంచి ఫ్రెండ్ అని దీపు నాయుడు వెల్లడించారు.