అత్యంత కామన్ గా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు(Pimples) ఒకటి.ఆడవారే కాదు మగవారు కూడా మొటిమలతో చాలా ఇబ్బంది పడుతుంటారు.
అయితే కొందరికి మొటిమల వల్ల ముఖంపై నల్లటి మచ్చలు(Dark spots) ఏర్పడుతుంటాయి.ఈ మచ్చలను పోగొట్టుకునేందుకు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు.
అయినా సరే మొటిమల వల్ల పడిన మచ్చలు పోవడం లేదా? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో సులభంగా స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు రెబ్బలు వేపాకు(Neem) మరియు పావు కప్పు ఫ్రెష్ గా చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్(aloe vera gel) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు(turmeric), వన్ టీ స్పూన్ శనగపిండి(gram flour), వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి (multani mitti)వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే ముఖంపై మొటిమల తాలూకు మచ్చలే కాదు ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా క్రమంగా మాయమవుతాయి.మొటిమల సమస్యకు అడ్డు కట్టపడుతుంది.మచ్చలేని చర్మం నీ సొంతం అవుతుంది.

అలాగే ఈ రెమెడీ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖం అందంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.కాబట్టి మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







