సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.ఇలాంటి వారు తమ జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఎన్నో ఖరీదైన కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే అలాంటి వారికి కొబ్బరి పాలు ఒక వరమని చెప్పుకోవచ్చు.
కొబ్బరి పాలల్లో( coconut milk) విటమిన్లు, ప్రోటీన్లు, జింక్ మరియు ఐరన్ మెండుగా ఉంటాయి.ఇవి మీ జుట్టు మరియు స్కాల్ప్ యొక్క సంరక్షణ కు సహాయపడతాయి.
అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి పాలను జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు మరియు ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులను కొబ్బరి పాలతో సహా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ(Shampoo) ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ మాస్క్(Mask) ను వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
కొబ్బరి పాలు, మెంతుల్లో(Coconut milk ,fenugreek) ఉండే విటమిన్లు, మినరల్స్ మరియు కెరాటిన్ శిరోజాలకు పోషణను అందిస్తాయి.కుదుళ్లను బలోపేతం చేస్తాయి.మరియు మీ కురులు డబుల్ అయ్యేందుకు సహాయపడతాయి.పల్చటి జుట్టు తో బాధపడుతున్న వారికి ఈ మాస్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే ఈ మాస్క్ పొడి జుట్టును నివారిస్తుంది.కురులు స్మూత్ గా, షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలకు సైతం చెక్ పెడుతుంది.