సాధారణంగా కొందరికి శరీర భాగాలన్నీ తెల్లగా ఉన్న కాళ్లు, చేతులు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఎండల ప్రభావం ఇందుకు ప్రధాన కారణంగా మారుతుంటుంది.
ఈ క్రమంలోనే నల్లగా మారిన కాళ్లు మరియు చేతులను తెల్లగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.బ్యూటీ పార్లర్ లో కాళ్లు, చేతులను మళ్లీ తెల్లగా మార్చుకోవడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ ఇంట్లోనే చాలా సులభంగా కాళ్లు మరియు చేతుల నలుపును వదిలించుకోవచ్చు.తెల్లగా మెరిపించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు హాట్ వాటర్ పోసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎనో( Eno ) పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ) , వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ షాంపూ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( coffee powder ) రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుని అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు మరియు కాళ్లకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై అర నిమ్మ చెక్కతో కాళ్లు మరియు చేతులను బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

దాదాపు ఐదు నిమిషాలు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.మూడు నుంచి నాలుగు రోజులు ఈ హోమ్ రెమెడీని పాటిస్తే మీ కాళ్లు చేతులు యొక్క నలుపు మొత్తం వదిలిపోతుంది.మళ్లీ కాళ్లు మరియు చేతులు తెల్లగా కాంతివంతంగా మెరుస్తాయి.
మృదువుగా మారతాయి.అలాగే చాలా మంది తమ మెడ నల్లగా ఉందని బాధపడుతూ ఉంటారు.
అయితే మెడ నలుపును వదిలించడానికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ రెమెడీని పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే డార్క్ నెక్ కు గుడ్ బై చెప్పవచ్చు.