ఢిల్లీ ఎన్సీఆర్( Delhi NCR ) లో పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఇప్పటి వరకు 12 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.
స్కూళ్లల్లో బాంబు ఉన్నట్లు ఈ-మెయిల్( E-mail ) ద్వారా బెదిరింపులు వచ్చాయి.మదర్ మేరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సంస్కృతి స్కూల్, సాకేత్ స్కూల్ తో పాటు నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలలను ఖాళీ చేయించారు.ఈ క్రమంలోనే డాగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బాంబ్ బెదిరింపు ఈ మెయిల్స్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలో ఇతర దేశం నుంచి బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు.







