ఇంగ్లాండ్‌లోని ఓ చర్చి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఎందుకంటే, వాళ్లు జనాల్ని ఆకర్షించడానికి ఒక అదిరిపోయే ప్లాన్ వేశారు.
నార్తర్న్ ఇంగ్లాండ్‌లోని షిప్లీ టౌన్‌లో (town of Shipley in Northern England)ఉన్న సెయింట్ పీటర్స్ ఆంగ్లికన్ చర్చి ప్రొఫెషనల్ రెజ్లింగ్‌ను దేవుడితో కలిపేసింది.అందుకే ఇప్పుడు దీన్ని అందరూ “రెజ్లింగ్ చర్చి” అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
ఈ ఐడియా వెనుక ఉన్న బ్రెయిన్ 37 ఏళ్ల గారెత్ థాంప్సన్(Brain 37-year-old Gareth Thompson).2022లో తను ఈ కొత్త పంథా మొదలుపెట్టాడు.చాలా మందిని మళ్లీ దేవుడి వైపు తిప్పాలంటే ఏదో కొత్తగా, అదిరిపోయేలా ఉండాలని అనుకున్నాడు.గారెత్ మాట్లాడుతూ జీసస్, రెజ్లింగ్ (Jesus, wrestling)రెండూ తన జీవితాన్ని మార్చేశాయని చెప్పాడు.
అందుకే ఈ రెండిటినీ కలిపేసి ఇలా చర్చికి కొత్త కళ తీసుకొచ్చాడు.ఇప్పుడు తనేమో గురువుగా బోధనలు చేస్తూనే, రెజ్లింగ్ షోకి హోస్ట్ లాగా కూడా చేస్తున్నాడు.పైగా, “ప్రే చేయ్, తిను, రెజ్లింగ్ చూడు, మళ్లీ రిపీట్(Pray, eat, watch wrestling, repeat.)” అని రాసున్న టీ-షర్ట్ వేసుకుని హల్చల్ చేస్తున్నాడు.గారెత్ ప్రకారం రెజ్లింగ్ కథలు బైబిల్ కథల్లాగే ఉంటాయట.“అందులో మంచి, చెడు మధ్య పోరాటం ఉంటుంది కదా” అంటాడు తను.“నేను క్రిస్టియన్‌గా మారిన తర్వాత రెజ్లింగ్‌ను కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టాను.డేవిడ్ వర్సెస్ గోలియత్, కైనూ, హేబెలు, ఏశావు తన వారసత్వాన్ని పోగొట్టుకోవడం లాంటి కథలు గుర్తొచ్చాయి.
అందుకే, ఇలాంటి కథల్ని రెజ్లింగ్ ఫార్మాట్‌లో చెబితే ఎలా ఉంటుంది అని ఆలోచించాను” అని గారెత్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్‌లో చర్చిలకు వచ్చేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది.2021 లెక్కల ప్రకారం చూస్తే, ఇంగ్లాండ్, వేల్స్‌లో సగం కంటే తక్కువ మంది మాత్రమే తాము క్రిస్టియన్లం అని చెప్పుకుంటున్నారు.అందుకే చర్చిలు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాయి.సెయింట్ పీటర్స్ చర్చి మెయిన్ ప్రీస్ట్ రెవరెండ్ నటాషా థామస్ కూడా ఈ కొత్త ఐడియాకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.“ఇది మామూలు చర్చిలా ఉండదు.కానీ, మనం ఎప్పుడూ కలవని కొత్త వాళ్ళని కూడా కలుపుతోంది” అని ఆమె అంటున్నారు.రెజ్లింగ్ చర్చి ఈవెంట్ ఎలా ఉంటుందంటే, మొదట చిన్న ప్రార్థన ఉంటుంది.
ఆ తర్వాత చర్చి కాస్తా రెజ్లింగ్ రింగ్‌లా మారిపోతుంది.అచ్చం WWE స్టైల్లో బాడీ స్లామ్స్‌తో, అదిరిపోయే ఫైట్స్‌తో రెండు గంటల పాటు రచ్చ రచ్చ ఉంటుంది.
కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు.కానీ గారెత్ మాత్రం తన పంథా కరెక్ట్ అంటున్నాడు.“మీరు రెజ్లింగ్‌ను నిజంగా నమ్మితే, అందులో లీనమైపోతారు.విశ్వాసం కూడా అంతే” అని గారెత్ అంటాడు.
ఈ చర్చి మొదలైన మొదటి సంవత్సరంలోనే ఏకంగా 30 మంది బాప్టిజం తీసుకున్నారంటే మామూలు విషయం కాదు.







