మనిషి వాంతులు చేసుకునేటప్పుడు మెదడులో ఏం జరుగుతుందో తెలుసా..

మన శరీరానికి సరిపోనీ ఏదైనా విష పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్న సమయంలో సాధారణంగా వాంతులు చేసుకుంటూ ఉంటాము.అయితే మనల్ని వీటి నుంచి రక్షించేందుకు మన మెదడు ఆ సమయంలో కీలక పనితీరును చేపడుతుంది.

 Do You Know What Happens In The Brain When A Person Vomits , China National Inst-TeluguStop.com

మెదడులో ఒక సర్క్యూట్ పనిచేయడం ప్రారంభమవుతుందని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడింది.మన శరీరంలో జరిగే ప్రతి జీవ క్రియను క్రమబద్ధీకరిస్తుంటే ఇలాంటి మెదడు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది ఇప్పటివరకు చాలా తక్కువే.

ఇదిలా ఉంటే చైనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ పరిశోధకులు శరీరం ప్రతిఘటించిన సమయంలో మెదడులో ఒక సర్క్యూట్ ప్రారంభం అవ్వడాన్ని గుర్తించారు.

కల్తీ లేదా టాక్సిన్స్ ఉన్న పదార్థాలను తీసుకున్న సమయంలో శరీరం వాటిని ఎదుర్కొనేందుకు కొన్ని క్షణాల్లోనే మెదడు తీసుకునే నిర్ణయాన్ని పరిశోధకులు తెలుసుకున్నారు.

దీనికి కారణం అవుతున్న పెద్ద ప్రేగు మెదడు సర్క్యూట్ ను గుర్తించారు.ఎలుకల్లో చేసిన పరిశోధనలో గట్- టూ- బ్రెయిన్ సర్క్యూట్ నీ గుర్తించారు.రేగుల్లోని రోగనిరోధక న్యూరో ఎండోక్రిన్ యాక్సిస్ ద్వారా టాక్సిన్ ప్రేరేపిత సంకేతాలు మెదడుకు చేరుతాయని అధ్యయనంలో తెలిసింది.సరిగ్గా ఇలాగే మానవుల్లో ఈ మెకానిజం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

Telugu Chinanational, Tips-Telugu Health

ఎలుకలలో జరిగిన పరిశోధనలలో పరిశోధకులు ఒక నమూనాను తయారు చేశారు.విష పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న సమయంలో మెదడు టాక్సిన్లకు వ్యతిరేకంగా రక్షణాత్మక ప్రతిస్పందనను ప్రారంభిస్తుంది.అయితే మెదడు ఈ విష పదార్థాలను ఎలా గుర్తిస్తుంది.ఢిపెన్సివ్ మెకానిజంను ఎలా సమన్వయం చేస్తుంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Telugu Chinanational, Tips-Telugu Health

బ్యాక్టీరియాల నుంచి వెలువడిన విష పదార్థం స్టెఫిలోకాకల్ ఎంటరోటాక్సిన్ ఏ, న్యూరో ట్రాన్స్ మీటర్ ఆక్టివేట్ చేస్తుంది.ఇది పేగులు మెదడుకు నరాల వెంట సిగ్నల్స్ పంపించే రసాయన ప్రక్రియ మొదలు పెడుతుంది.పేగులు మెదడు మధ్య ఉండే న్యూరాన్ లను Tac1+DVC అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు.దీంతో శరీర రక్షణాత్మక చర్యలను మొదలవుతుందని తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube