పల్నాడు జిల్లా రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది.పాఠశాలలో భోజనం చేసిన అనంతరం సుమారు 40 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఉదయం నుంచి బాధిత విద్యార్థినులకు జ్వరంతో పాటు వాంతులతో ఇబ్బంది పడుతున్నారు.వెంటనే స్పందించిన గురుకుల పాఠశాల సిబ్బంది బాధితులను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా ఫుడ్ పాయిజన్ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.







