పల్నాడు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

పల్నాడు జిల్లా రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది.

పాఠశాలలో భోజనం చేసిన అనంతరం సుమారు 40 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఉదయం నుంచి బాధిత విద్యార్థినులకు జ్వరంతో పాటు వాంతులతో ఇబ్బంది పడుతున్నారు.

వెంటనే స్పందించిన గురుకుల పాఠశాల సిబ్బంది బాధితులను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా ఫుడ్ పాయిజన్ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025