రాముని సకల గుణ సంపన్నుడని అంటారు. ఇంతకీ ఆయనలోని సుగుణాలేమిటి?

సకల గుణ సంపన్నుడైన శ్రీరామ చంద్రుడిలో సహనం మేరు పర్వత మంత ఉన్నతమైనది.మహా రాజులు, చక్రవర్తులలో ఈ గుణం తక్కువగా ఉంటుంది.

 Rama Is Said To Be Endowed With All Virtus What Are His Qualities So Far,kaikei,-TeluguStop.com

మానవ జాతికి ఆదర్శ పురుషుడుగా అవతరించిన రాముడు, తను మహారాజుగా పట్టాభిషిక్తుడవుతున్నానని తెలిసినా పొంగిపోలేదు.ముందు రోజు రాత్రి గురువుల ఆదేశానుసారం ఉపవాస నియమంతో అధశ్శమనంతో మౌనంగా గడిపాడు.

అక్కడ కైకేయి అంతఃపురంలో మంధర మాట విని తన కొడుకు భరతుడే రాజు కావాలని, రాముడు పధ్నాలుగు ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలని పట్టు బట్టింది.పట్టాభిషేకానికి అలంకృతుడైన రాముడిని పిలిపించి ఈవిషయం చెప్పారు.

శాంతమూర్తి అయిన రాముడు వింటూనే రాజ లాంఛనాలన్నీ తీసేశాడు.
ఉత్తరీయం కూడా అక్కడ ఉంచి సంతోషంగా “అమ్మా!నాన్నగారికి నామీద ఎంత అనురాగం ఉందా? నిరంతరం రాజ్య పాలనతో, సమస్యలతో సతమత మవకుండా అరణ్యంలో పుణ్య పురుషులైన మహర్షుల సన్నిధానంలో పరతత్వాన్ని ఉపాసించే అవకాశం అనుగ్రహించారు” అని కొనియాడాడు.“అన్నయ్యా, ఈరాజ్యం నీకు దక్క కుండా చేసేవారిని నా కరవాలానికి బలిఇస్తా”నని తమ్ముడు లక్ష్మణుడు.ఆగ్రహంతో నిప్పులు చెరగ్గా, శ్రీరాముడు ‘శాంతం’ అంటూ ఎంతో స్సగా అతనిని సముదాయించాడు.

Telugu Devotional, Kaikei, Lakshmana, Ramudu, Sri Ramudu-Telugu Bhakthi

అరణ్యవాసంలో రాముడు భరించిన కష్టం, చూపిన ఓరిమి అంతా ఇంతా కాదు.హంసతూలికా తల్పం, అనుచరగణం, దాస దాసీలతో భోగ భాగ్యాలు అనుభవించాల్సిన మహారాజు, కంద మూలాలు తింటూ, రాతి నేల మీద పడుకున్నాడు.ఎముకలు కొరికే చలిలో, ఎండా వానల్లో సర్వ కాల రాజనుచరగణంలో రాముడు ఓర్సును వీడలేదు.సహనాన్ని కోల్పోలేరు.పలు మార్లు సర్వావస్థలో రాముడు లక్ష్మణుడు అన్నయ్యా మనకు ఇదేం గతి అంటూ అసహనంతో కైకేయిని దూషించినా, అలా అనడం తప్పు అని ఓదార్చిన శ్రీ రామచంద్రుని ఓర్పు, సహనం అనితర సాధ్యం.అందుకే ఆయన సకల గుణాభిరాముడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube