సిద్దార్థ్ , అదితీరావు హైదరీ( Siddharth , Aditi Rao Hydari ) మరికొన్ని వారాల్లో పెళ్లి చేసుకోనున్నారనే సంగతి తెలిసిందే.సిద్దార్థ్ అదితి పెళ్లి తేదీకి సంబంధించిన శుభవార్త కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే అదితీరావు హైదరీ ప్రేమ, పెళ్లి గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రేమపై నాకు చిన్నప్పటి నుంచి నమ్మకం ఉందని అదితీరావు హైదరీ అన్నారు.
త్వరలో అదితీరావు హైదరీ నటించిన హీరామండీ ది డైమండ్ బజార్ సిరీస్ రిలీజ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్( Web series ) ప్రమోషన్స్ లో భాగంగా అదితి మాట్లాడుతూ ఈ సిరీస్ లో నేను మృదు స్వభావం కలిగిన పాత్రలో నటిస్తున్నానని అన్నారు.
పర్సనల్ గా కూడా నేను అలాగే ఉంటానని ఆమె తెలిపారు.బాల్యం నుంచి ఫ్యామిలీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉందని దేని కోసం పోరాడాల్సిన అవసరం రాలేదని అదితి పేర్కొన్నారు.
నా పేరెంట్స్ కూడా నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.
లవ్ విషయంలో నాకు చిన్నప్పటి నుంచి నమ్మకం ఏర్పడిందని విశ్వాసం ఉంటే దేన్నైనా సాధించగలమని ఆమె కామెంట్లు చేశారు.మహిళలు చాలా విషయాలలో సర్దుకుపోతుంటారని అదితి వెల్లడించారు.నేను దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతానని ఆమె అన్నారు.
హీరామండీలో పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అదితి తెలిపారు.సంజల్ లీలా భన్సాలీ స్త్రీలను చూపించే విధానం స్పెషల్ అని అదితి వెల్లడించారు.
వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరని అన్ని కోణాల్లోనూ చూపించడం ఆయనకే సాధ్యం అని అదితి అన్నారు.అదితి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సిద్దార్థ్, అదితిలకు ఇది రెండో పెళ్లి కాగా కలకాలం ఈ జోడీ సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అదితి నటించిన వెబ్ సిరీస్ మే నెల 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.