మన శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ సి( Vitamin C ) ఒకటి.ఈ విషయం అందరికీ తెలుసు.
కానీ విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే అవుతుంది.ఎముకలు, రక్తనాళాలు, చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ సి అవసరం ఎంతో ఉంది.
అలాగే మన శరీరంలో జరిగే మరిన్ని పనులకు విటమిన్ సి అవసరం అవుతుంది.అందుకే నిత్యం విటమిన్ సి ని ఆహారం ద్వారా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

పొరపాటున విటమిన్ సి లోపం ఏర్పడితే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.మన బాడీ ఐరన్ ను గ్రహించాలి అంటే విటమిన్ సి కావాలి.ఎప్పుడైతే విటమిన్ సి లోపిస్తుందో మన బాడీ ఐరన్ ను అబ్సర్వ్ చేసుకోలేక పోతుంది.దాంతో రక్తహీనత సమస్య( Anemia problem ) ఏర్పడుతుంది.అలాగే విటమిన్ సి లోపం వల్ల కీళ్ల నొప్పులు( Joint pains ) ఇబ్బంది పెడతాయి. నీరసం, అలసట, విపరీతంగా వేధిస్తాయి.

చర్మం పాలిపోవడం, శరీరం బలహీనంగా మారడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ళ వాపు.ఇవన్నీ విటమిన్ సి లోపం వచ్చే సమస్యలే.అలాగే శరీరంలో విటమిన్ సి లేకపోతే గాయాలు కూడా త్వరగా మానవు. చర్మం పొడిగా, కాంతిహీనంగా మారిపోతుంది.గుండె ఆరోగ్యం( Heart health ) దెబ్బతింటుంది.రక్తపోటు స్థాయిలు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
అందుకే శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిను అందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్, లెమన్, టమాటో, పైనాపిల్, బొప్పాయి బ్రోకలీ, కివి, స్ట్రాబెర్రీ, క్యాప్సికం, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, జామ, గ్రేప్స్ వంటి ఆహారాల్లో విటమిన్ సి మెండుగా నిండి ఉంటుంది.
కాబట్టి ఈ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.తద్వారా విటమిన్ సి లోపం ఏర్పడకుండా ఉంటుంది.