జనసేనలో చేరికలు లేకపోవడానికి ఇదే కారణమా ?

జనసేన పార్టీ( Jana sena )లో చేరికల ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు.తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 Is This The Reason For Not Joining Janasena , Janasena, Janasenanani, Lokesh, T-TeluguStop.com

ఈ ప్రకటన తర్వాత కూడా పార్టీలో చేరికలు ఉత్సాహం కనిపించడం లేదు.ఒకవైపు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.

మరోవైపు అధికార పార్టీ వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని టిడిపి , జనసేనలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే ఏపీలోనూ పరిస్థితులు నెలకొన్నాయి.

జనాలతో పాటు వైసిపి నాయకుల్లోను తమ పార్టీపై అసంతృప్తి ఉన్నా , జనసేన వైపు వచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenanani, Lokesh, Pavan Kalyan, Tdpjanasen

వైసీపీని( YCP ) వీడే వాళ్లంతా టిడిపిలో చేరేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.చేరికలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జనసేన లో కాస్త నిరుత్సాహమే కనిపిస్తోంది.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu Naidu ), జనసేనతో పొత్తు ఈ రెండు అంశాలతో ఆ కూటమి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం అందరిలోనూ కలుగుతుంది.

వైసీపీకి ప్రత్యామ్నాయంగా టిడిపి జనసేన కూటమిగా ఏర్పడ్డాయి ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు.ఆయన బయటికి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి టిడిపిలోకి వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

అయితే టిడిపి వైపు వెళ్లేందుకే వైసీపీ అసంతృప్త నేతలు ఆసక్తి చూపిస్తున్నారు తప్ప , జనసేన ను పరిగణలోకి తీసుకోకపోవడం ఆ పార్టీలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.వాస్తవ పరిస్థితిని చూసుకుంటే , టిడిపిలో నాయకుల కొరత లేదు.175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులే ఉన్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenanani, Lokesh, Pavan Kalyan, Tdpjanasen

 కానీ , జనసేన పరిస్థితి ఆ విధంగా లేదు.దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకులు,  అభ్యర్థులు లేరు.అటువంటి నియోజకవర్గల్లో ఇతర పార్టీల నుంచి చేరికలు చోటు చేసుకోవాల్సి ఉన్నా,  టిడిపి తో పొత్తు కారణంగా జనసేనలో చేరినా పెద్దగా ఉపయోగం ఉండదనే లెక్కల్లో చాలామంది నేతలు వెనకడుగు వేస్తున్నారట.

ఇక జనసేనలో చేరినా సీట్ల విషయంలో పవన్,  టిడిపి అధినేత చంద్రబాబును పట్టు పట్టేందుకు అంత ఆసక్తి చూపించరని , పొత్తులో భాగంగా టిడిపి ఇచ్చే సీట్లతో సరిపెట్టుకుంటారని, అందుకే ఆ పార్టీలోకి వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదనే లెక్కల్లో చాలామంది నేతలు ఆ పార్టీలో చేరేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube