ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)( Overseas Citizen of India ) కార్డులను కలిగివున్న తల్లిదండ్రులకు పుట్టి భారతదేశంలో పెరిగిన 17 ఏళ్ల బాలికకు భారతదేశ పౌరసత్వాన్ని ( Indian Citizenship ) మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పిటిషనర్.
ఓసీఐ కార్డుదారులైన తల్లిదండ్రులకు భారతదేశంలో జన్మించింది.ఇక్కడే చదువుకుని , తన కుటుంబంతో ఇండియాలోనే నివసిస్తున్నప్పటికీ .ఆమె భారతీయ పాస్‌పోర్ట్ పొందలేకపోయింది.భారత పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 5(4) , పాస్‌పోర్ట్ చట్టం 1967 ప్రకారం ఇది ప్రత్యేక పరిస్ధితిగా జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ పేర్కొన్నారు.
పిటిషనర్ రచితా ఫ్రాన్సిస్ జేవియర్( Rachita Francis Xavier ) తన పాస్‌పోర్ట్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.తన తల్లిదండ్రులిద్దరూ గతంలో భారతీయ పౌరులేనని ఆమె కోర్టుకు తెలియజేసింది.
అయితే 2005లో వారు అమెరికా పౌరసత్వాన్ని పొందగా.బాలిక పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు భారతీయ పౌరులు కాదు.
తాను అక్రమ వలసదారుని కాదని, రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వానికి అర్హత కలిగివున్న భారత సంతతి వ్యక్తిగా పేర్కొంది.పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.
బాలిక తల్లిదండ్రులిద్దరూ భారతీయ పౌరులు కావడంతో ఆమె పరిస్దితులను వివరణ 2 కింద పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఓసీఐ కార్డ్దారులు కూడా భారతదేశంలో ఉండటానికి హక్కును కలిగివున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది.వారి కుటుంబాలను కూడా పోషించుకోవచ్చునని.పిటిషనర్ విషయంలోనూ ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఓసీఐ కార్డుదారులని, ఆ బాలిక పుట్టిన క్షణం నుంచి భారతదేశంలోనే వుందని పేర్కొంది.
ఆమె ఇండియాలోనే చదువుకున్నదని, ఇప్పుడు పాస్‌పోర్టును కోరిందని హైకోర్టు తెలిపింది.పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం భారతీయ పౌరుడిగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి బాలికను ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.

ఇకపోతే.ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్ అనేది విదేశీ పౌరులుగా వున్న భారత సంతతికి చెందిన వ్యక్తులకు భారత ప్రభుత్వం( Indian Government ) జారీ చేసే పాస్‌పోర్ట్ లాంటి పత్రం.జనవరి 26, 1950 తర్వాత భారతదేశ పౌరులుగా వున్నట్లయితే .వారిని భారతదేశ విదేశీ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది.దీని వల్ల భారతదేశానికి వెళ్లడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఓసీఐ కార్డు( OCI Card ) ద్వారా జీవిత కాలం పాటు ఎలాంటి వీసా లేకుండా భారత్‌కు రావొచ్చు.
ఓసీఐ కార్డున్న వారు ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ భూముల కొనుగోలు తప్ప మిగతా అన్ని హక్కులూ పొందేందుకు వెసులుబాటు వుంది.







