చర్మవ్యాధుల‌కి బొప్పాయితో పరిష్కారం

బొప్పాయి అనగానే అందరికి తెలిసింది ఒక్కటే మనం దానిని తినడం వల్ల‌ ఆరోగ్యంగా ఉంటాం అని కాని బొప్పాయి పండు మాత్రమే కాదు దాని చెట్టు ,ఆకులు,లోపల గింజలు మన ఆరోగ్యానికి ,చిన్న చిన్న వ్యాధుల నియంత్రణకి చాలా బాగా ఉపయోగపడుతాయి.కొంతమందికి తల మీద పేను కోరుకుడులా వచ్చి అక్కడ జుట్టు రాలిపోతుఉంటుంది దానికి కారణం అక్కడ ఎలర్జీ కారణంగా చర్మవ్యాధి రావడమే

 Papaya Control Skin Diseases-TeluguStop.com

ఈ ఎలర్జీని తగ్గించడం కోసం బొప్పాయి పువ్వుని మెత్తగా చేసి సమస్య ఉన్న చోట రుద్దితే వెంట్రుకలు పెరుగుతాయి అంతేకాకుండా ఎలర్జీ కూడా తగ్గుతుంది.

జుట్టు ఊడిపోతున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం వల్ల‌ మరలా జుట్టుని పొందే అవకాశం ఉంటుంది.బొప్పాయి చెట్టునుండి వచ్చే పాలు గజ్జి ,తామరా వంటి చర్మ వ్యాధులని నిర్మూలిస్తాయి.

పురిపిడి కాయలు ఉన్న వాళ్ళు సైతం బొప్పాయి పాలను ఆరారగా అద్దుతూ ఉంటే పురిపిడి కాయలు రాలిపోతాయి

అంతేకాదు బొప్పాయి ఆకుని మెత్తగా దంచి ఆ పేస్టుని అరికాళ్ళలో వచ్చే ఆనకాయల మీద ఉంచితే అవి మెత్తబడి మెల్లగా తగ్గుతాయి.మొటిమలు తగ్గడానికి బొప్పై కాయని దంచగా వ్బచ్చిన రసాన్ని ముఖానికి రాస్తే తగ్గుముఖం పడతాయి.

శోభి మచ్చలు ,ముఖం మీద తరచుగా వచ్చే నల్ల మచ్చలు ఈ రసంతో పోతాయి.బొప్పాయి గింజల పేస్టుని కూడా వీటితో పాటు వాడవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube