మనలో చాలా మంది రక్తహీనత( Anemia ) సమస్యతో బాధపడుతున్నారు.అలాగే ఎముకల బలహీనత కూడా ఎందరినో వేధిస్తోంది.
ఈ రెండిటి కారణంగా అనేక ఇబ్బందులు పడుతుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.
అయితే ఈ రెండిటికీ చెక్ పెట్టే ఒక పవర్ ఫుల్ జ్యూస్ ఒకటి ఉంది.రోజు ఉదయం ఈ జ్యూస్ తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయినా.
ఎముకల బలహీనత అయినా ఎగిరిపోతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా నైట్ నిద్రించే ముందు ఒక బౌల్ లో పది నల్ల ఎండు ద్రాక్షలు( Black Raisin ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఒక యాపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసుకోవాలి.అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న ఎండు ద్రాక్షను వాటర్ తో సహా వేసుకోవాలి.

వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా హెల్తీ అండ్ టేస్టీ జ్యూస్ సిద్ధం అవుతుంది.రుచికరంగానే కాదు ఈ జ్యూస్ లో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.ముఖ్యంగా ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్ తో పాటు విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ ను ఈ జ్యూస్ ద్వారా పొందవచ్చు.
రోజు ఈ జ్యూస్ తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ ( Hemoglobin )శాతం పెరుగుతుంది.రక్తహీనత పరార్ అవుతుంది.అలాగే బలహీనంగా ఉన్న ఎముకలు దృఢంగా మారతాయి.జాయింట్ పెయిన్స్ ఎగిరిపోతాయి.
అంతేకాదు ఉదయం ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.
చర్మం గ్లోయింగ్ గా మెరుస్తుంది.మరియు జీర్ణక్రియ సైతం చురుగ్గా పనిచేస్తుంది.