S J Surya : అసిస్టెంట్ దర్శకుడిగా పని చేయడం కోసం కార్ కింద పడి యాక్సిడెంట్ డ్రామా

సినిమా పిచ్చి ఏ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పడానికి ఈ ఆర్టికల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సంఘటన ఒక సాధారణ యువకుడు అసిస్టెంట్ డైరెక్టర్( Assistant Director ) గా ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన పరిణామ క్రమం గురించి.

 S J Surya Accident Drama To Join As Assistant Director-TeluguStop.com

ఒకసారి సినిమా పురుగు బుర్రలో దూరింది అంటే అది ఎవరిని తిన్నగా కూర్చోనివ్వదు.చదువు, ఉద్యోగం, తల్లిదండ్రులు, కుటుంబం అనే వాటిని దగ్గరికి కూడా రానివ్వదు అన్నిటికీ అతీతంగా సినిమా పనిచేస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ సినిమా చేతికి వచ్చిందా అదే మహా అదృష్టంగా భావించి తమ వెంట నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు దర్శకులు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఖుషి సినిమా దర్శకుడు యస్ జై సూర్య గురించి.తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడంతో డిగ్రీ పూర్తి చేయాలి అనే నిబంధన పెట్టారు సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలంటే ఏదో ఒక డిగ్రీ ఉండాలి కాబట్టి, ఆ డిగ్రీ పట్టా చదివి తండ్రి చేతిలో పెట్టి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Telugu Assistant, Bhagyaraj, Vasanth, Khushi, Surya-Telugu Stop Exclusive Top St

యస్ జే సూర్య( S J Surya ) మొదటినుంచి జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసి ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎదగాలని భావించాడు.అలా కొన్నాళ్ల పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా నటించి సినిమా ఇండస్ట్రీలో ఇక ముందు జూనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగితే పైకి ఎదగలేను అని భావించి కొన్నాళ్ల పాటు విరామం ప్రకటించాడు.ఆ తర్వాత మళ్లీ దర్శకుడుగా మారాలని, మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే తప్ప అనుభవం రాదు అని పెద్ద డైరక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడానికి నానా తంటాలు పడ్డాడు.చాలా మంది దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు.

దాంతో ఒక రోజు భాగ్యరాజ్ తన భార్య తో కలిసి కారులో వెళుతున్న సందర్భంగా ఆ కారుకు అడ్డుగా వెళ్లి దానిపై పడిపోయినట్టుగా నటించాడు సూర్య.

Telugu Assistant, Bhagyaraj, Vasanth, Khushi, Surya-Telugu Stop Exclusive Top St

దాంతో భాగ్యరాజ్ ( Bhagyaraj )కారు దిగి ఏమైనా దెబ్బలు తగిలాయ అంటూ అతడిని లేపే ప్రయత్నం చేశాడు.కానీ భాగ్యరాజ్ తో తాను ఎందుకు కార్ మీద పడినట్టుగా నటించాను అని చెప్పే లోపే చుట్టుపక్కల జనాలు గుమిగూడి అతడిని లేపి కారుని అక్కడి నుంచి పంపించేశారు.తాను కష్టపడి ఆక్సిడెంట్ డ్రామా జరిపి భాగ్యరాజ్ తో పరిచయం పెంచుకోవాలని సూర్య చాలా కష్టపడ్డప్పటికీ ఆ కష్టం జనాల వల్ల వృధా కావడంతో అందరిని తిట్టుకుంటూ మళ్లీ తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

Telugu Assistant, Bhagyaraj, Vasanth, Khushi, Surya-Telugu Stop Exclusive Top St

అలా తిరుగుతూ తిరుగుతూ డైరెక్టర్ వసంత్( Director Vasanth ) దగ్గర ఆరేళ్ల తర్వాత అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాడు.ఆ తర్వాత అతడు పడుతున్న కష్టాన్ని చూసి ఖచ్చితంగా దర్శకుడు అవుతాడని నమ్మి మొదట అసిస్టెంట్ దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.ఆ తర్వాత పరిచయాలు పెరిగి అజిత్ తో వాలి అనే సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube