నీరసం.ఒక్కోసారి పట్టుకుందంటే వదలనే వదలదు.దాంతో ఏ పని చేయలేక మంచాన్నే పట్టుకుని వేలాడుతుంటారు.తమ పనులను చేసుకోవాలన్నా ఓపిక ఉండదు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను తీసుకుంటే నీరసం పరార్ అవ్వడమే కాదు.శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం నీరసాన్ని తరిమికొట్టి తక్షణ శక్తినందించే ఆ సూపర్ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు వాల్ నట్స్, పది ఎండు ద్రాక్షలు వేసి.ఒక కప్పు వాటర్ పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే మిక్సీ జార్‌లో నానబెట్టుకున్న వాల్ నట్స్, ఎండు ద్రాక్షలను వాటర్‌తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ పాలు పోయాలి.
పాలు కాస్త మరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న వాల్ నట్స్, ఎండు ద్రాక్షల పేస్ట్ వేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు హీట్ చేయాలి.చివరిగా అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ బెల్లం తురుము, పావు స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు బాయిల్ చేస్తే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధమైనట్లే.

ఈ డ్రింక్‌ను రోజుకు ఒక గ్లాస్ చప్పున ఉదయాన్నే తాగితే నీరసం, అలసట పరార్ అవుతాయి.శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.అంతేకాదండోయ్.ఈ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.రక్తహీనత దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య నుండి సైతం విముక్తి లభిస్తుంది.