మన దేశంలో చాలామంది ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఒక్కో దేవాలయానికి వెళ్లి ఒక్కో రకమైన పూజలను చేస్తూ ఉంటారు.అందుకే ఏ రోజు ఏ భగవంతునికి ఇష్టమైన రోజో దానిని తెలుసుకొని ఆ దేవుని పూజించడం వల్ల వారి జీవితంలో ఎప్పుడూ దేవుని అనుగ్రహం ఉంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే చాలా మంది ప్రజలు ఆదివారం పూజలు చేయకుండా వారి ఇంట్లో వారికి నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు.
ముఖ్యంగా వారంలోని ఏడు రోజులలో ఆదివారం సూర్యభగవంతునికి ఎంతో ఇష్టమైన రోజు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలన్నిటికీ సూర్య భగవానుడే రాజు.అందుకే సూర్య దేవుని అనుగ్రహం మనపై ఉంటే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
సూర్యదేవుని అనుగ్రహం మన ఇంటిపై ఉండాలంటే తప్పనిసరిగా ఆదివారం ఈ పరిహారాలు చేయడం వల్ల చేసి సూర్య భగవానుని నమస్కరించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి.వారంలోని ప్రతి ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవంతునికి ఉదయిస్తున్న సమయంలోనే సూర్యదేవునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి.

అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు, ఖచ్చితంగా ‘ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః’ అనే మంత్రాన్ని పాటించాలి.అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యి దీపం వెలిగించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం ఆ ఇంటి పై ఉండటమే కాకుండా లక్ష్మీదేవి కూడా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.అంతేకాకుండా ఆదివారం రోజు వస్త్ర దానం, బెల్లం, పాలు వంటి వాటిని దానం చేయడం కూడా ఎంతో పుణ్యఫలం లభించే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ఆదివారం ప్రవహించే నీటిలో బెల్లం, బియ్యం కలపడం ఎంతో శుభంగా చాలామంది భావిస్తారు.
ఆదివారం రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల సూర్య భగవంతుని అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది.