Radhika apte losing roles : నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఆ హీరోయినే: రాధిక ఆప్టే

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Radhika Apte Opens Losing Roles Younger Actresses Radhika Apte, Losing Roles,-TeluguStop.com

అంతేకాకుండా ఈమె సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది.కాగా రాధిక ఆప్టే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎటువంటి పాత్ర చేయడానికి అయినా కానీ ఆమె వెనకాడదు.

సినిమాలలో విభిన్నమైన పాత్రను సెలెక్ట్ చేసుకుంటూ కేవలం నటనకు ప్రాధాన్యమైన పాతలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది రాధిక ఆప్టే.

అయితే ఈమె బోల్డ్ నెస్ వల్ల పలుసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇంటర్వ్యూలో భాగంగా రాధిక ఆప్టే మాట్లాడుతూ.

యంగ్ హీరోయిన్స్ కారణంగా ఆమె అవకాశాలు కోల్పోతున్నట్లుగా తెలిపింది.ఇక లుక్స్ కారణంగా ఎప్పుడైనా సినిమాలలో పాత్రలను కోల్పోయారా అని యాంకర్ ప్రశ్నించగా.

Telugu Bollywood, Radhika Apte, Tollywood-Movie

ఆ విషయంపై స్పందించిన రాధిక ఆప్టే హీరోయిన్స్ ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ఒక ప్రధాన అంశం.అందుకే కమర్షియల్ సినిమాలలో యంగ్ హీరోయిన్ లకి ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.అంతేకాకుండా టాలెంట్ ని కాకుండా లుక్స్ ని బట్టి కూడా అవకాశాలు ఇవ్వడం అన్నది ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఉంది అని తెలిపింది.నేను మాత్రం అందం అనే మాయలో ఎప్పుడు పడలేదు.

యవ్వనంగా కనిపించడం కోసం నేను ఎప్పుడూ సర్జరీలను కూడా చేయించుకోలేదు.అలాగే అవకాశాల కోసం కూడా ఏనాడు అడ్డుదారులు తొక్క లేదు.

కానీ కెరియర్ లో సక్సెస్ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube