అధిక హెయిర్ ఫాల్ ( Hair fall )మరియు హెయిర్ గ్రోత్ లేకపోవడం కారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా మారిపోతుంటుంది.దీని కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు.
ఊడిన జుట్టును మళ్ళీ పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీని కనుక పాటిస్తే రెండు నెలల్లో మీ పల్చటి జుట్టు దట్టంగా మారుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అంగుళం అల్లం ముక్కను( ginger ) పొట్టు తొలగించి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ), మూడు రెబ్బలు కరివేపాకు( curry leaves ) మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఒక న్యాచురల్ హెయిర్ సీరం రెడీ అవుతుంది.ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ సీరం ను కనుక వాడితే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.

ఈ సీరం జట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.ఈ సీరంను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం ఆగిపోయి దట్టంగా పెరగడం ప్రారంభమవుతుంది.అల్లం, కరివేపాకు, మెంతులు ఆరోగ్యమైన దృఢమైన జుట్టును ప్రోత్సహిస్తాయి.అలాగే స్కాల్ప్ ను కూడా హెల్తీగా శుభ్రంగా ఉంచుతాయి.
చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.