ఓ మనిషి సక్సెస్ కావాలంటే అతడి హ్యాబిట్స్ మంచివై ఉండాలని పెద్దలు చెప్తుంటారు.అయితే, అలవాటు అనేది వ్యసనంగా మారినా ప్రమాదమే.
ఇక ఈ రోజుల్లో యూత్ ధూమపానం, మద్యపానానికి అలవాటు పడి తమ ప్రాణాలకు హాని చేకూర్చుంటున్న సంగతి తెలిసిందే.కాగా, మనిషికి హాని చేకూర్చే ఆ అలవాట్ల కంటే కూడా ఇంకా ప్రమాదకరమైనవి ఉన్నాయట.
అవేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
స్మోకింగ్ కంటే డేంజరస్ ఈ ఐదు అలవాట్లు అని మానిసిక నిపుణులు పేర్కొంటున్నారు.
అవేంటంటే ఒంటరితనం, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, నిరాశావాదం.మనుషులు ఒంటరితనానికి అలవాటు పడితే ప్రమాదమే.దీర్ఘకాలిక ఒంటరితనం హెల్త్‌ను అతి త్వరగా నాశనం చేస్తున్నదని అనేక పరిశోధనల్లో తేలింది. దీని ఎఫెక్ట్ ముఖ్యంగా హ్యూమన్ బ్రెయిన్‌పై ఉంటుంది.
లోన్లీనెస్ వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయని పలు శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి.సువిశాల భారతదేశంలో 22 శాతం మంది పెద్దలు ఒంటరిగానే ఉంటున్నాయి.
ఇటీవల కాలంలో యూత్‌లోనూ ఒంటరితనపు పోకడలు పెరిగాయని పలువురు చెప్తున్నారు.

ఈ రోజుల్లో ఆరోగ్యం కంటే కూడా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.ఇక తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా క్వాలిటీవి కాకుండా దొరికిన వాటితో అడ్జస్ట్ అవుతుండటం చూడొచ్చు.ఇలా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే వారి సంగతి ఇక అంతే అని చెప్పొచ్చు.
ఇలాంటి అలవాట్ల వల్ల ఊబకాయం, డయాబెటిస్‌తో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశముంటుంది.ఇక నేటి ఉరుకుల పరుగుల జీవనంలో గంటల కొద్ది ఎల్‌ఈడీ బల్బుల మధ్యే జీవనం సాగిపోతుంటుంది.
బాడీకి ఎక్సర్‌సైజెస్ అనేవే ఉండవు అసలు.ఫలితంగా ప్రాణాంతక వ్యాధులైన పెద్దపేగు కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదముంది.
నిద్రలేమి అలవాటు కూడా వెరీ డేంజరస్.నేటి యువత గంటల కొద్ది స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల నిద్ర లేమి ఇంకా ఇంకా పెరిగిపోతున్నది.
స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ ఎల్‌ఈడీ లైట్స్ వల్ల ఐస్ మొత్తంగా దెబ్బతినే పరిస్థితులొస్తాయి.నిరాశావాదం కూడా ప్రమాదకరమైన అలవాటే.
ప్రతీ విషయంలో అందరూ ఆశావాద దృక్పథమే అలవర్చుకోవాలని పెద్దలు చెప్తుండటం మనం చూడొచ్చు.ఆత్మవిశ్వాసం మెండుగా ఉంచుకోవడం ద్వారా నిరాశావాదం అసలు మన దరిచేరదు.
ఒక వేళ ఐదు అలవాట్లు మీకు ఉంటే వాటిని వెంటనే వదిలేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.