మనకు తెలుసు కృష్ణ ( Krishna )మరియు విజయ నిర్మల ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని.అంతకు ముందే వారికి వారి వారి మొదటి పెళ్ళిళ్ళ ద్వారా సంతానం ఉన్నప్పటికీ విడాకులు లాంటివి లేకుండానే సినిమాల్లో పని చేస్తున్న క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి అది పెళ్లికి దారి తీసింది.
కృష్ణ కి కానీ విజయ నిర్మల కు కానీ వారికీ అంతకు ముందు జరిగిన పెళ్లి వల్ల ఎలాంటి అడ్డంకి రాదు అని కాన్ఫినెన్స్ ఉండేది.ఈ ఇద్దరికీ ఎవరి పర్మిషన్ తో పని లేదు.
సంతానం కనాల్సిన అవసరం లేదు.కలిసి ఉంటె చాలు అనుకున్నారు.
సమాజం వారిని ఎలా చుసిన ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకునే పని లేదు.దాంతో ఒక సుముహర్తం చూసుకొని ఒకటి అయ్యారు.
కానీ తల్లి ఉన్న తండ్రి తో ఎలాంటి సంబంధాలు లేని నరేష్ కృష్ణ( Naresh Krishna ) గారిని తండిలా చూసుకున్నారు, కృష్ణ గారు కూడా తండ్రి లా ఆదరించారు కానీ ఏ రోజు కూడా తండ్రి స్థానం మాత్రం ఇవ్వలేదు.అలాగే నరేష్ కూడా ఇప్పటి వరకు కొన్ని వందల ప్రెస్ మీట్స్ అమ్మ గారు కృష్ణ గారు అంటారు తప్ప ఈరోజు నా తండ్రి సామానులు అనలేదు.ఆలా ఎందుకు చేయలేరో అందరికి తెలుసు.నరేష్ ఎప్పటికి ఆయనను నాన్న అని పిలవరు.అందుకు విజయ నిర్మల కూడా ఒప్పుకోదు.అలాగే కృష్ణ తరపున వారు కూడా అంగీకరించారు.
ఆస్తులు కూడా ఒకరికి సంబంధించి మరొకరు ముట్టుకోవడానికి ఇష్టపడని జంట కృష్ణ మరియు విజయ నిర్మల జంట.
చనిపోయే వరకు ఒకరి సాంగత్యం ఒకరు కోరుకున్నారు తప్ప ఇంకా ఎలాంటి గొప్పలకు పోలేదు.వారి హద్దులు దాటలేదు.కృష్ణ మొదటి భార్య కుటుంబం నుంచి ఆయన్ను ఎవరు వేరు చేయలేదు.
అలాగని అయన మొదటి కుటుంబం తో పద్మ పుట్టిన రోజు నుంచి గడిపింది లేదు.విజయ నిర్మల చనిపోయిన ఒంటరిగానే ఆమె ఇంట్లో ఉన్నారు.ఆ టైం కృష్ణ మొదటి భార్య దగ్గరికి వెళ్తాడు అని అందరు అనుకున్న అయన మాత్రం ఒప్పుకోలేదు.ఆలా నరేష్ చివరి వరకు అన్ని చూసుకున్నాడు కానీ తండ్రిగా చెప్పుకోలేదు.
ఆయనకు ఆ అవకాశం కూడా ఆ కుటుంబం కల్పించలేదు.