రాజమౌళికి పోటీగా మారుతున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. ఇద్దరిలో నంబర్ వన్ ఎవరు?

ఏంటి రాజమౌళికి ( Rajamouli ) ఒక డైరెక్టర్ పోటీగా రాబోతున్నారా? అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ఒక యంగ్ డైరెక్టర్ జక్కన్నకు పోటీ ఇవ్వడంతో పాటు, రాజమౌళి డైరెక్షన్ ను సవాల్ చేస్తున్నాడట.

 Gossip Garage Atlee To Compete With Rajamouli Details, Atlee, Rajamouli, Tollywo-TeluguStop.com

జక్కన్న విజువల్ వండర్ కి మించి చూపిస్తానంటున్నాడు సదరు దర్శకుడు.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా.

ఆయన మరెవరో కాదండోయ్ డైరెక్టర్ అట్లీ.( Director Atlee ) ఇప్పటికే ఈయన రాజా రాణి, థెరి, మెర్సిల్, బిగిల్ లాంటి సినిమాలు చేసి సూపర్ డూపర్‌ హిట్లు కొట్టాడు.

ఇక షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్ మూవీ( Jawan Movie ) తీసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.

Telugu Atlee, Rajamouli, Jawan, Pan, Rajamouli Atlee, Tollywood-Movie

ఈ సినిమా ఏకంగా 12వందల కోట్లు రాబట్టింది.ఇక అప్పటి నుంచి అట్లీ పేరు నేషనల్‌ లెవల్ లో మార్మోగుతోంది.ఇదిలా ఉండగా డైరెక్టర్ అట్లీ తన నెక్ట్స్ మూవీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ప్రకటించేశారు.

దీంతో అట్లీ నెక్ట్స్ మూవీ పై అనౌన్స్ రాకముందే స్పెషల్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇక అప్పటి నుంచి అట్లీ 6వ ప్రాజెక్ట్ రాజమౌళి సినిమాకు సవాల్‌ విసిరేలా వస్తుందంటూ ఒక ప్రచారం జరుగుతోంది.

ఇటు రాజమౌళి కూడా తన నెక్ట్స్ మూవీ పాన్ వరల్డ్( Pan World ) అంటున్నారు.ఇప్పడు అట్లీ కూడా పాన్ వరల్డ్ జపం చేస్తూ టెక్నీషియన్లను హలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారట.

Telugu Atlee, Rajamouli, Jawan, Pan, Rajamouli Atlee, Tollywood-Movie

అంతే కాదు రాజమౌళి సినిమా కంటే ముందే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అట్లీ ఆతృతగా ఉన్నారట.ఇన్నాళ్లకి రాజమౌళికి సరితూగే డైరెక్టర్ దిగిపోయాడని టాక్ వినిపిస్తోంది.మరి ఈ పోటీలో నెగ్గేదెవరో తగ్గేదెవరో ప్రూవ్ చేయాల్సింది మాత్రం వాళ్ల సినిమాలే అని చెప్పాలి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొందరు ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు జక్కన్నను బీట్ చేయడం అంటే సాధ్యమయ్యే పని కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube