ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ ఘటనలో శ్రీ తేజ( Sri Teja ) గాయపడిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ దాదాపు 16 రోజులుగా హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాడు.
ఇక శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు కిమ్స్ హాస్పిటల్ ( Kim’s Hospital )యాజమాన్యం కూడా తెలుపుతూనే ఉంది.ఇక అలాగే అల్లు ఫ్యామిలీ కూడా శ్రీ తేజ ఆరోగ్య విషయం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు.
తాజాగా శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్.శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది.
అప్పుడప్పుడు పిట్స్ లాంటివి వస్తున్నాయని,కళ్ళు తెరుస్తున్నాడు, కానీ మనుషుల్ని గుర్తు పట్టడం లేదని కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ లో తెలిపింది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలావరకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఆ చిన్నారి కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఇటీవల పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) విడుదల రోజున ప్రీమియర్ సిమ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ ( Sandhya theater )లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అని మహిళా చనిపోయిన విషయం తెలిసిందే.
ఆమె కుమారుడు శ్రీ తేజ అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.శ్రీ తేజ ఆరోగ్యంపై హీరో అల్లు అర్జున్ అన్నీ చూసుకుంటున్నాడు.ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్, సీపీ సీవీ ఆనంద్ లాంటి పలువురు ప్రముఖులు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు.ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.
వైద్యులు కూడా ఆ చిన్నారిని కాపాడేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పుడిప్పుడే ఆ చిన్నారి ఆరోగ్యం కుదుటపడుతోంది.
ఆ చిన్నారి పూర్తిస్థాయిలో కోలుకొని త్వరగా తిరిగి రావాలని మెగా అభిమానులు ఫ్యామిలీ ఇలా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.