షార్క్ ట్యాంక్( Shark Tank ).ఈ రియాల్టీ షో గురించి మనందరికీ తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వీక్షించే రియాల్టీ షో లలో ఇది కూడా ఒకటి.ఇప్పటికే ఈ షో దాదాపుగా మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
త్వరలోనే నాలుగవ సీజన్ కూడా మొదలు కానుంది.షార్క్ ట్యాంక్ ఇండియా 4వ సీజన్ ( India 4th season )వచ్చే ఏడాది జనవరి 6 నుంచి సోనీ లైవ్ లో ప్రసారం కానుంది.
కొత్త షార్క్‌లు,కొత్త హోస్ట్ తో కొత్త సీజన్ తిరిగి వచ్చింది.అయితే ఈ షోలో కొత్త షార్క్ లలో ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేశ్ అగర్వాల్ ( Group CEO Ritesh Agarwal )సైతం ఉన్నారు.

ఈ క్రమంలోనే ఓయో హోటల్స్ ( Oyo Hotels )ఎలా స్టార్ట్ అయ్యింది? అనే విషయాలను పంచుకున్నారు.తాజాగా ఈ షోలో ఓయో హోటల్స్ సీఈవో రితేశ్ అగర్వాల్ తన బిజినెస్ సీక్రెట్ రివీల్ చేశాడు.హోటల్స్ రంగంలో ఓయో విజయం సాధించడానికి కారణం గురించి మాట్లాడుతూ.తన సక్సెస్ కు పూర్తి క్రెడిట్ ఒక్క సినిమాకే ఇచ్చారు.ఆ సినిమా చూసిన తర్వాతే ఓయో హెటల్స్ పెట్టడానికి ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు.3 ఇడియట్స్ నా జీవితాన్ని మార్చేసింది.ఆ సినిమాలో ఫాలో యువర్ ప్యాషన్, మనీ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఫాలో అవుతుంది అనే సినిమా సందేశం నిజంగా నా మనసును తాకింది.మీరు మీ అభిరుచిని, ఆలోచనను అనుసరిస్తే విజయం మిమ్మల్ని ఫాలో అవుతుందనేది నేను నమ్మాను.

ఆ సినిమా చూసిన వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనపై పూర్తిగా నమ్మకంతో ఉన్నాను.అలా ఓయో పుట్టింది.ఏదైనా కొత్తగా వినూత్నంగా చేయాలనే తపనతో ఇదంతా మొదలైంది.వ్యాపారవేత్తలకు నా సలహా ఏమిటంటే డబ్బు సంపాదించడం పై మాత్రమే దృష్టి పెట్టవద్దు.మీ అభిరుచిని అనుసరించండి, డబ్బు స్వయంగా మీ దగ్గరకు వస్తుంది అని చెప్పుకొచ్చారు రితేష్ అగర్వాల్.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.