ప్రస్తుత రోజులలో చాలా మంది పండ్లు, కూరగాయలు, బట్టలు, ఆహార పదార్థాలు ఇలా అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు.ఈ క్రమంలో బెంగళూరుకు( Bangalore ) చెందిన ఒక యువతి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లో దహీపూరి చాట్ ఆర్డర్ ( Dahipuri chat order )చేసింది.
కానీ, ఆమెకు వచ్చిన పార్శిల్‌లో దహీపూరికి బదులు ఇంకేదో ఉండటంతో షాక్ అయింది.విసుగు చెందిన ఆ యువతి బెంగళూరు విడిచి వెళ్ళడానికి 101 కారణాలలో ఇది కూడా ఒక కారణమని తన అసహనాన్ని సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియ చేసింది.

ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళ్తే… దహీపూరి చాట్ చాలా మందికి ఇష్టమైన సాయంత్రపు చాల ఇష్టంగా తింటారు .అందుకే చాలా మంది రోడ్డు పక్కన చాట్ బండ్ల వద్ద దహీపూరి తింటూ ఉంటారు.బెంగళూరులో నివసిస్తున్న ఒక ఉత్తరాది యువతికి కూడా దహీపూరి తినాలనిపించింది.దాంతో ఆమె ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది.అయితే, ఇంటికి వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా, దహీపూరికి బదులుగా సాధారణ పూరి పార్శిల్, ఒక పెరుగు గిన్నె వచ్చాయి.

ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.తన అసహనాన్ని ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేస్తూ, “బెంగళూరును విడిచిపెట్టడానికి 101 కారణాలలో ఇది కూడా ఒకటి” అని తెలియచేసింది.ఈ పోస్ట్ బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.
వామ్మో.ఇలాంటిది ఎప్పుడు చూడలేదు అని కొందరు అంటే, మరికొందరు అంతగా తినాలి అని ఉంటే బయటికి వెళ్లి తినచ్చు కదా.ఇలా ఆర్డర్ పెట్టుకోవాలా అని కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు.







