శివుడికి దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుంది?

మనకు తెలిసినంత వరకు శివుడు అభిషేక ప్రియుడు.అందుకే ఎక్కువగా శివుడికి అంటే శివ లింగానికి అభిషేకాలు జరిపిస్తుంటాం.

 Shivabhishekham Upayogalu , Shivabhishekham , Devotional , Shankarudu , Shivudu-TeluguStop.com

సోమ వారాల్లో శివరాత్రి పర్వ దినాల్లో అయితే శివుడికి అభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వెళ్తుంటారు.అయితే శివుడికి చాలా రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తుంటా.

కానీ దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో మాత్రం మనకు తెలియదు.అయితే దేని వల్ల శివ లింగానికి అభిషేకం చేస్తే.

ఏ ఫలితం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తులసీ తీర్థంతో శివుడికి అభిషేకం చేస్తే మనశ్శాంతి కల్గుతుంది.

అలాగే పాలుతో  దీర్ఘాయువు లభిస్తుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది.

చక్కెరతో చేయడం వల్ల శత్రుజయం కల్గుతుంది.తేనెతో అభిషేకిస్తే… విద్యా, సంగీత వృద్ధి సిద్ధిస్తుంది.

నెయ్యితో స్వర్ణార్హత, పన్నీరుతో సకల ఐశ్వర్య ప్రాప్తి, చందనంతో ధనాభి వృద్ధి, విభూదితో చేయడం వల్ల సర్వరోగ నివారిణి, నిమ్మరసంతో చేస్తే మరణ భయం పోతుంది.అలాగే పంచామృతాలతో అభిషేకిస్తే… దేహదారుఢ్యం, పువ్వలుతో సుఖం, అరటి పళ్లతో వ్యవసాయం, అన్నంతో పెళ్లి, సౌభాగ్యం, పంచలోహ జలంతో మంత్ర సిద్ధి, కస్తూరితో కార్యసాఫల్యం, దానిమ్మరసంతో శత్రువశీకరణ, సుగంధ ద్రవ్యాలతో ఆయుర్దాయం కల్గుతాయి.

అయితే మానవుడు తన కోరికలను తీర్చుకునేందుకు భగవంతుడిని నవ విధాలుగా కొలుస్తున్నాడు.అయితే ఆ పరమ శివుడిని అభిషేకించడం ద్వారా… స్మరించడం ద్వాలా ఆ భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

మీకు కావాల్సిందేదో తెలుసుకొని.దానితో మాత్రమే శివాభిషేకం చేయడం ఉత్తమం అని వేద పండితులు సూచిస్తున్నారు.

Shivabhishekham Upayogalu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube