బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి.ఈమె జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లలో, వెండితెరపై పలు సినిమాలలో నటించింది.
తన అందంతో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.నిత్యం సోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్ తో కనిపిస్తుంది.
మొదట్లో ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటి ద్వారా సోషల్ మీడియా స్టార్ గా మారింది.అలా వెండితెరపై అడుగు పెట్టింది.చాలా వరకు హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.ఇక బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అవకాశం రావడంతో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక అమ్మకోసం, ఇంటి గుట్టు సీరియల్స్ లో కూడా నటించింది.ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టి అందులో లేడీ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకుంది.
అందులో తన అందాలతో జబర్దస్త్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.ఎప్పుడు ఏదో ఒక గెటప్ తో బాగా హైలెట్ అవుతుంది.ఇక తన నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్లను పడేసింది రీతూ చౌదరి. జబర్దస్త్ లో కూడా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా సందడి చేస్తుంది.
అంతేకాకుండా అజర్ తో అందరూ ముందే రొమాన్స్ చేస్తూ బాగా షాక్ లు ఇస్తుంది.అలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటోంది.

హైపర్ ఆది వల్ల జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది రీతూ చౌదరి.మొత్తానికి ఈమెకు బుల్లితెరపై ఒక స్పెషల్ క్రేజ్ రావటంతో ఒక స్టార్ హీరోయిన్ లా రెడీ అవుతూ అందరికి షాక్ ఇస్తుంది.కానీ ఈమె ఎన్ని ఫోటోలు పంచుకున్న కూడా బాగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటుంది.
ఇక వాటిని తట్టుకోలేక కామెంట్లు రావద్దని కామెంట్ సెషన్ ను మ్యూట్ లో పెట్టేసింది ఆ మధ్య.

ఇక ఈ బ్యూటీ మొత్తానికి తన అభిమానులకు ఒక షాక్ ఇచ్చింది.అదేంటంటే ఈ హాట్ బ్యూటీ పెళ్లి ఫిక్స్ అయింది.తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన భర్తతో దిగిన ఫోటోలు పంచుకొని తన ఫాలోవర్స్ కి పరిచయం చేసింది.ఆయన పేరు శ్రీకాంత్ అని.తమ బంధం కంటే ఏది బెటర్ కాదని క్యాప్షన్ కూడా ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.కొందరు అప్పుడే పెళ్లి చేసుకుంటావా అని కామెంట్లు పెడితే.మరికొందరు కంగ్రాట్స్ అని చెబుతున్నారు.







