కేజిఎఫ్.ఈ పేరు చెబితే చాలు ప్రేక్షకులకు పూనకాలు వస్తాయి.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యింది.మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక పార్ట్ 2 ఈ మధ్యనే రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగ రాసింది.ఇక ఈ రెండు పార్ట్ లు హిట్ అవ్వడంతో డైరెక్టర్ నీల్ మాత్రమే కాదు హీరో యష్ కూడా సూపర్ స్టార్స్ అయిపోయారు.
అలాగే ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కూడా బాగా పాపులర్ అయ్యింది.ఈ సినిమాతో హోంబలే ఫిలిమ్స్ వారు కూడా బాగా పాపులర్ అయ్యారు.
ఈ ఇచ్చిన సక్సెస్ తో ఈ సంస్థ మరిన్ని సినిమాలను నిర్మిస్తుంది.స్టార్స్ కూడా ఈ నిర్మాణ సంస్థతో పనిచేయాలని ఆశ పడుతున్నారు.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని బాషల స్టార్స్ కూడా ఈ సంస్థలో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
అందుకు కారణాలు కూడా ఉన్నాయి.
ఈ సంస్థ వందల కోట్లతో నిర్మాణం చేపడుతూ.స్టార్స్ కు కూడా రెమ్యునరేషన్స్ ను భారీగా ఆఫర్స్ చేస్తున్నారు.
అలాగే నీల్ కెజిఎఫ్ సినిమాతో ఈ సంస్థకు ఒక బ్రాండ్ ఇమేజ్ ను తీసుకు వచ్చాడు.దీంతో స్టార్స్ అంతా హోంబలే ఫిలిమ్స్ తో పనిచేయాలని అనుకుంటున్నారు.ప్రెసెంట్ ఈ సంస్థ మన టాలీవుడ్ హీరో ప్రభాస్ తో నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ ను కూడా లాక్ చేస్తున్నారు.వీరు మలయాళం స్టార్ పృధ్వీ రాజ్ సుకుమారన్ తో ఒక సినిమా, ఆకాశమే నీహద్దురా సినిమాను తెరకెక్కిన సుధా కొంగర తో ఒక సినిమా నిర్మిస్తున్నారు.ఈ సినిమాల గురించి మిగతా సమాచారం అఫిషియల్ గా ప్రకటించలేదు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధా కొంగర సినిమా మల్టీస్టారర్ అని తెలుస్తుంది.ఈ మల్టీ స్టారర్ లో సూర్య, నాని, దుల్కర్ సల్మాన్ లు కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారట.
ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి అన్ని ఇండస్ట్రీల మార్కెట్ ను టార్గెట్ చేయడానికి హోంబలే ఫిలిమ్స్ రెడీ అవుతుంది అని టాక్ వినిపిస్తుంది.మరి ఇదే నిజం అయితే హోంబలే ఫిలిమ్స్ మరింత విస్తరించడం ఖాయం.







