రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే హిమోగ్లోబిన్ పెంచే ఫుడ్ ఇవే..!

ఎనీమియా ( Anemia )అంటే రక్తం తగ్గించే వ్యాధి.ఈ వ్యాధి పెద్దల్లో కంటే చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

 Are You Suffering From Anemia But These Are The Foods That Increase Hemoglobin ,-TeluguStop.com

అందుకే పిల్లలకు ఫుడ్ తో పాటు బ్లడ్ ప్రొటీన్, విటమిన్స్, ఉండే ఫుడ్ ను ఇవ్వాలి.క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలీ ఐరన్, బి కాంప్లెక్స్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ కు మంచి మూలం.

కాబట్టి ఐరన్, హిమగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే బ్రోకలీని ఉడికించి తినాలి.తక్కువ బ్లడ్ వలన శరీరం యొక్క పనితీరుపై ప్రభావం పడుతుంది.

హిమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనత తో పాటు కాలేయం, మూత్రపిండాల పని తీరుపై ప్రభావం పడుతుంది.హిమోగ్లోబిన్ లోపం కారణంగా అలసట, బలహీనత, కామెర్లు, తరచుగా తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

Telugu Anemia, Complex, Beet Root, Broccoli Iron, Folic Acid, Tips, Hemoglobin,

అయితే హిమోగ్లోబిన్ ( Hemoglobin )స్థాయి పెంచడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.ఇక హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి.అయితే బీట్ రూట్( Beet root ) లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్, విటమిన్ బి1,బి2,బి6 విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి.

అలాగే కూరగాయలు, సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.ఇక మునగ కూడా చాలా బాగా పనిచేస్తుంది.

ఇక బచ్చలి కూర, ఆవాలు, లాంటివి వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Telugu Anemia, Complex, Beet Root, Broccoli Iron, Folic Acid, Tips, Hemoglobin,

ఇక పచ్చి ఆకుల్లో ఉండే విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్( Vitamin B12, folic acid ), ఇతర పోషకాలు హిమోగ్లోబిన్ ను పెంచడానికి పనిచేస్తాయి.ఇక దానిమ్మ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ అలాగే కాల్షియం, ఇనుము లాంటి వాటికి మూలం.ఇక ప్రతిరోజు దానిమ్మ రసం కూడా ఖచ్చితంగా తాగాలి.

దీని వలన బ్లడ్ తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.అలాగే బ్లడ్ తక్కువగా ఉండటం వలన ఆహారంలో ఇనుము, విటమిన్ బి12 లోపం, రక్త క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ వ్యాధి, థైరాయిడ్, తలసేమియా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కారణం కావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube