మామూలుగా కాకరకాయలు( Bitter Gourd ) చాలామంది ఇష్టం లేదని అంటూ ఉంటారు.అలాగే కాకరకాయ తినేందుకు ఎవ్వరు కూడా అంతగా ఇష్టపడరు.
కాకరకాయ చేదుగా ఉండటం వలన చాలామంది వీటిని దూరంగా పెడుతూ ఉంటారు.చిన్న పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా చాలా మంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు.
కానీ కొందరు మాత్రం కాకరకాయ చేదుగా ఉన్నా సరే ఇష్టంగా తింటూ ఉంటారు.కానీ కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అసలు ఇక ఉండలేరు.
ఇది శరీరంలో పిండి పదార్థాలు అలాగే షుగర్ లెవెల్స్ ( Sugar levels )ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.

అధికంగా మద్యం సేవించిన వారికి కూడా మత్తు దిగిపోవాలంటే రెండు చెంచాల కాకరకాయ జ్యూస్( Bitter Gourdjuice ) ఇస్తే చాలు ఎంతమంది తాగినా కూడా దెబ్బకు దిగిపోవాల్సిందే.అలాగే పాదాలు మంటగా ఉన్నప్పుడు కూడా కాకరకాయ జ్యూస్ పట్టించడం వలన ఆ మంట సమస్య నుండి బయటపడవచ్చు.ఇక కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతున్న పిల్లలకి కూడా అర చెంచా కాకరకాయ రసం, ఒక చెంచా తేనె ( Honey )కలిపి రాత్రి పూట పడుకునే ముందు మూడు నాలుగు రోజులు అలా తాగిస్తే కడుపులో ఉన్న పురుగులు చనిపోతాయి.
ఇక మొలలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా నెలరోజుల పాటు రెండు మూడు చెంచాల కాకరకాయ రసం మజ్జిగలో కలిపి తీసుకుని వాడడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.

అలాగే రక్తస్రావం అయ్యే స్త్రీలు కాకరకాయ రసం, తేనెలను ఒక చెంచా చొప్పున రుతుస్రావానికి ఒక వారం రోజులు ముందు నుండి తాగితే పరిస్థితి మంచిగా మెరుగుపడుతుంది.అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.కాకరకాయ కూరను తరచుగా తీసుకుంటే దానిలో విటమిన్ ఏ, బి, సి, ఇనుము తదితరాలు కంటిచూపు మెరుగుపడుతుంది.
ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా కాకరకాయ రసం, నాలుగు ఐదు మిరియాలు తేనెలలో కలిపి, పరగడుపున మూడు నాలుగు సార్లు తీసుకోవడం వలన ధర్మవ్యాధులు, దురదలు, గజ్జి లాంటివి పోతాయి.ఇక ఈ కాకరకాయలను మితిమీరి తీసుకున్నట్లయితే అజీర్ణం, వాంతులు లాంటి సమస్యలు కూడా రావచ్చు.
కాబట్టి కాకరకాయ రసం కూడా మితిమీరి తీసుకోవడం మంచిది కాదు.అలాగే ఎండాకాలంలో కాకరకాయలు తీసుకోవడం వలన మలబద్ధకానికి దారి తీస్తుంది.