స్టమక్ అల్సర్( Stomach ulcer ) అనేది కడుపు లోపలి భాగం లేదా చిన్నపేగు మొదటి భాగంలో ఏర్పడే పుండ్లు.దీనిని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని కూడా అంటారు.
కడుపులో మంటకు చాలా మంది కారాలు, మసాలాలు తినడమే కారణమని అనుకుంటారు.కానీ స్టమక్ అల్సర్ వల్ల కూడా కడుపులో మంట లేదా మంటతో కూడిన నొప్పి ఏర్పడుతుంది.
అలాగే కడుపు నొప్పి, అపాన వాయువు, అజీర్ణం, ఆకలి తగ్గిపోవడం, తలనొప్పి, ఉబ్బరం వంటివి కూడా స్టమక్ అల్సర్ లక్షణాలే.సమస్య తీవ్రమైనప్పుడు రక్తపు వాంతులు లేదా రక్తస్రావంతో కూడిన మలం వంటి లక్షణాలను ఫేస్ చేస్తారు.
అసలు స్టమక్ అల్సర్ కు కారణాలేంటి? ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.స్టమక్ అల్సర్‌కు వివిధ కారణాలు ఉంటాయి.
హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా చాలా సందర్భాల్లో స్టమక్ అల్సర్‌కు ప్రధాన కారణం అవుతుంది.అలాగే వేడి వేడి ఆహారం, మసాలా ఫుడ్స్, జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఫుడ్స్, మరియు కాఫీ ( Coffee )ఎక్కువగా తీసుకోవడం కడుపులోని గాయాలను తయారు చేసే ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది.

మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కూడా కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచి గాయాలను ఏర్పరచవచ్చు.ధూమపానం, ఆల్కహాల్( Smoking, alcohol ) వంటి చెడు వ్యసనాలు, ఎక్కువగా ప్రొఫెన్, ఆస్పిరిన్ వంటి పైన్ కిల్లర్స్ వాడటం కడుపులో పుండ్లను కలిగించవచ్చు.పైన చెప్పుకున్న లక్షణాలు మీలో కనుక ఉంటే వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ లేదా యాంటీ అసిడ్స్ వాడాల్సి ఉంటుంది.

అలాగే స్టమక్ అల్సర్ ను పరిష్కరించుకునేందుకు పలు ఆహార నియమాలను పాటించాలి.మసాలాలు, కాఫీ, ఆల్కహాల్ లేదా అధిక ఆమ్లత కలిగిన ఆహారాలను ఎవైడ్ చేయాలి.మృదువైన మరియు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.భోజనాన్ని ఒకేసారి అధిక మొత్తంలో కన్నా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.గ్రీన్ టీ, అల్లం టీ, మింట్ టీ, పెరుగు, కీరా, ఆకుకూరలు స్టమక్ అల్సర్ ను తగ్గించడంలో తోడ్పడతాయి.ఇక ఒత్తిడిని తగ్గించుకోండి.
మరియు ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోండి.తద్వారా స్టమక్ అల్సర్ నుంచి త్వరగా బయటపడొచ్చు.