టాప్ హీరోయిన్ పద్మప్రియ జానకిరామన్(Padmapriya Janakiraman).ఒకప్పుడు మలయాళం లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా శ్రీను వాసంతి లక్ష్మి(Srinu Vasanthi Lakshmi), అందరి బంధువయ,పటేల్ సార్ (Patel sir)వంటి సినిమాలలో నటించి మెప్పించింది పద్మప్రియ.అలా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు టాప్ హీరోయిన్గా రాణించింది.
ఆ తర్వాత ఈమె తన చిరకాల స్నేహితుడు అయిన జాస్మిన్ షాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరి పెళ్లి అయ్యి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు వీరికి సంతానం కలగలేదు.

ఆ ఒక్క ముచ్చట కూడా తీరిపోయుంటే తన జీవితం మరింత సంతోషమయమై ఉండేదంటోంది పద్మప్రియ.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చాలా విషయాలను పంచుకుంది.ఈ సందర్భంగా పద్మప్రియ మాట్లాడుతూ.ఎన్నో సినిమాలు చేయాలనుకున్నాను.కానీ అదే సమయంలో బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.ఎందుకంటే నటిగా నా ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు.
ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పటికీ మంచి అవకాశాలు అంత త్వరగా వచ్చేవి కావు.

అందుకే బ్రేక్ తీసుకున్నాను.అంతేకాదు ముప్పై దాటిందంటే హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు.అందుకే నా అంతట నేనే సైడ్ అయిపోయాను.
అయినా ఇలాంటి బ్రేక్స్ తీసుకోవడం యాక్టర్స్ కు అవసరం అని నా అభిప్రాయం.ఇప్పుడైతే నాకు పిల్లలు కావాలనుంది.
అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది.ఒకప్పుడు పెళ్లే వద్దనుకున్నాను.
కానీ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాను.సినీ ఇండస్ట్రీలోకి రాకూడదు అనుకున్నాను కానీ వచ్చాను.
బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా మళ్లీ సినిమాలు చేయొద్దనుకున్నాను కానీ చేశాను.అందుకే జీవితం ఎప్పుడు? ఎలా? ఎటువైపు మలుపు తిరుగుతుందో మనం చెప్పలేము అని తెలిపింది పద్మప్రియ.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







