ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా అటు నవ్వుతూ నవ్విస్తూ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.అంతే కాదు అందరూ సొంత వాళ్లే అన్నట్లుగా ట్రీట్ చేస్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్.
కేవలం సహా హీరోలతో మాత్రమే కాకుండా అటు దర్శక నిర్మాతలతో కూడా సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్.ఇక అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇటీవలే ఒక సీనియర్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ కు తనకు మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చింది అంటూ చెబుతున్నారు సీనియర్ నిర్మాత.ఆయన ఎవరో కాదు ఆవుల గిరి.ఇక ఆయన పేరు దాదాపు సినీ ప్రేక్షకులు అందరికి కూడా తెలుసు.ఒకప్పుడు నైజాంలో ఆయన ఎన్నో సూపర్ సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి బాలయ్య బ్లాక్బస్టర్ నరసింహనాయుడు సినిమాలను పంపిణీ చేశారు.అప్పట్లో ఆవుల గిరి ఏదైనా సినిమా పంపిణీ చేస్తున్నారు అంటే చాలు నైజాంలో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగి పోతూ ఉండేవి.
డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సినిమాలను కూడా తీసి పేరు సంపాదించుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆవుల గిరి సుకుమార్ కారణంగానే తనకు తారక్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చింది అంటూ చెబుతున్నారు.అప్పట్లో సుకుమార్ ఎన్టీఆర్కు మేనేజర్గా పని చేసేవారట.ఎన్టీఆర్ హీరోగా ఆవుల గిరి నిర్మాతగా ముళ్ళపూడి దర్శకత్వంలో నా అల్లుడు అనే సినిమా వచ్చింది.2005 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.సినిమాలో శ్రియ జెనీలియా హీరోయిన్ లుగా నటించారు.
అయితే నా అల్లుడు సినిమా తర్వాత ఎన్టీఆర్తో మరో సినిమా చేయలేదు ఆవుల గిరి.అయితే అప్పట్లో ఎన్టీఆర్ మేనేజర్గా ఉన్న సుకుమార్ తనను మానసికంగా టార్చర్ పెట్టాడని ఒకసారి అతని గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ చివరికి ఆక్సిడెంట్ కూడా అయిందని.
చిత్ర పరిశ్రమపై వెనక్కి రావడానికి కూడా సుకుమార్ కారణం అంటూ ఆవుల గిరి చెప్పుకొచ్చాడు.తారక్ మేనేజర్ సుకుమార్ కొడాలి నాని ని కూడా చాలా ఇబ్బందులు పెట్టాడని గుర్తుచేశాడు ఆవుల గిరి.