తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సదా( Sadha ) ఒకరు.ఈమె తేజ( Teja ) దర్శకత్వంలో తెరకేక్కిన జయం( Jayam ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతో అద్భుతంగా నటించిన సదా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఈ సినిమాలో వెల్లవయ్య వెళ్ళు అనే డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి సదా అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే సదా తెలుగుతోపాటు తమిళ భాష చిత్రాలలో కూడా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా చాలా బిజీ అయ్యారు.ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
పలు బుల్లితెర కార్యక్రమాలలో ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షోలకు ఇమేజ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఇదిలా ఉండగా సదాకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదా తన మొదటి సినిమా సమయంలోనే డైరెక్టర్ తేజ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ తనని కనుకరించలేదని తెలుస్తుంది.
సదా ఇంతలా బాధపడేలా డైరెక్టర్ తేజ( Director Teja ) ఏం చేశారు అనే విషయాన్నికి వస్తే ఈ సినిమాలో హీరో నితిన్ ( Nithin ) విలన్ పాత్రలో గోపీచంద్( Gopichand ) నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నితిన్ కోసం సద గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నితిన్ ని కలుసుకుంటుంది.అదే సమయంలోనే గోపీచంద్ వారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సదా పట్ల కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తారు.
ఈ సన్నివేశంలో గోపీచంద్ ఆమెను నాలికతో నాకుతాడు.ఈ సీన్ చేయడానికి సదాకు ఏమాత్రం ఇష్టం లేదట.
ఈ సన్నివేశంలో తాను నటించలేనని కన్నీళ్లు పెట్టుకుంటూ డైరెక్టర్ ని వేడుకున్నప్పటికీ డైరెక్టర్ మాత్రం ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అవుతుందని తప్పనిసరిగా నటించాల్సి ఉంటుంది అంటూ కరాకండిగా చెప్పడంతో చేసేదేమీ లేక ఈమె తనకు ఇష్టం లేకపోయినా ఈ సన్నివేశంలో నటించారని తెలుస్తుంది.డైరెక్టర్ బలవంతం తోనే సదా ఈ సీన్ చేశారని, ఈ సీన్ చేసిన సదా షాట్ అయ్యాక.10సార్లు ముఖం కడుక్కునప్పటికీ తనకు ఏదో తెలియని బాధ తనని కొన్ని రోజుల పాటు వెంటాడింది అంటూ ఓ సందర్భంలో ఈమె వెల్లడించారు.