అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైంది హీరోయిన్ షాలిని పాండే.మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మతి పోగొట్టింది.
ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది.బయోపిక్ సినిమాలైనా మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలోను చిన్న చిన్న పాత్రల్లో నటించింది షాలిని.
కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది అయినప్పటికీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి బాగానే ఎదిగింది.
వాస్తవానికి పెద్ద అందగత్తెమీ కాదు షాలిని పాండే.
పైగా హైట్ కూడా తక్కువే ఉంటుంది, లక్కు కలిసి రావడంతోనే మొదటి రెండు సినిమాలతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని స్థానాన్ని దక్కించుకుంది.అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె కెరియర్ ఎవరైనా ఆ సినిమా వల్ల వచ్చిన ఫాలోయింగ్ ని, క్రేజ్ ని ఆ తర్వాత తన కెరీర్ మలుచుకోవడానికి ఉపయోగించుకోవడంలో సంపూర్ణంగా ఫెయిల్ అయింది.
కథల ఎంపికలో సైతం షాలిని పాండే అనేక పొరపాట్లు చేసి పరాజయాలను మూటగట్టుకుంది.
కాస్త బొద్దుగా కూడా ఉండడంతో అవకాశాలు తక్కువ రావడాన్ని గమనించిన షాలిని ఆ తర్వాత తన బాడీ మేకోవర్ చేసుకొని అద్భుతంగా ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో వదిలింది.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమెకు చిన్న సినిమాల నిర్మాతలు అనేక అవకాశాలు ఇచ్చినా కూడా ఆ డిమాండ్ ని షాలిని సరిగా ఉపయోగించుకోలేదు.దాంతో కరోనాకి ఏడాది ముందు వరకు సరైన సినిమాలు ఆమెకు దక్కలేదు.

ఆ తర్వాత తను చేస్తున్న తప్పుల నుంచి రియలైజ్ అయిన షాలిని హీరోయిన్ గా బిజీ కావడానికి అనేక కసరత్తులు చేస్తోంది షాలిని.పైగా బాంబే నుంచి వచ్చింది కాబట్టి ఈ అమ్మడుకు పరిచయాలకు కొదవేమి లేదు.దాంతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆమె కెరియర్ను మళ్ళీ గాడిలో పెట్టుకోవాలని ఆపసోపాలు పడుతుంది.
ఇక సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే శాలిని పాండే పై మధ్యకాలంలో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ రూమర్స్ వల్ల కూడా షాలిని కాస్త డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తోంది.ఇది ఏమైనా అర్జున్ రెడ్డి లాంటి మరొక హిట్టుపడితే తప్ప షాలిని భవిష్యత్తును ఎవరు కాపాడలేరేమో.