Anjali : ఆ రోజు ప్రేమను కాదనుకుంది, కుటుంబాన్ని వద్దనుకుంది.. ఈ రోజు గెలిచి చూపించింది

అంజలి.ఫోటో సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం నేడు ఒక స్టార్ యాక్టర్ గా కొనసాగుతుంది.

 Untold Success Story Of Heroine Anjali , Rajolu, Godavari , Anjali, Hero Jai, To-TeluguStop.com

గోదావరి జిల్లా, రాజోలు లో పుట్టి పెరిగిన అంజలి, పై చదువుల కోసం చెన్నై కి వెళ్ళింది.అక్కడే డిగ్రీ వరకు చదువుకొని ఆపై సినిమా అవకాశాలు సంపాదించుకుంది.

తన తల్లిదండ్రులు కూడా నటీనటులు అవ్వాలని భావించిన అది కుదరకపోవడం తో తనను నటిగా చూసి తమ కల సాకారం చేసుకున్నారు అని అంజలి ఎప్పుడు చెప్తూ ఉంటుంది.ఇక అంజలి ఒక చెల్లి మరియు తమ్ముడు కూడా ఉన్నాడు.

ఇక తెలుగు , తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించిన అంజలి ఈ మధ్య కాలంలో కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మెరుస్తుంది.

తన సినిమా జీవితం నేటి వరకు సాఫీగానే సాగుతున్న వ్యక్తిగత జీవితం అనేక కుదింపులకు గురయ్యింది.

చదువుల కోసం తన పిన్ని ఇంట్లో ఉంటూ సినిమాల్లో నటించాలని భావించింది అంజలి.కానీ ఆమె పిన్ని మాత్రం అంజలి ఓకే ఎటిఎం లాగ వాడుకుంది.దాంతో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది.ఆమె చెర నుంచి తప్పించుకున్న అంజలి, తనకు సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయినా హీరో జై తో ప్రేమలో పడింది.

ఆ తర్వాత కొన్నాళ్ల వరకు అతడితో సహజీవనం కూడా చేసింది.కానీ జై పేరుకు మాత్రమే హీరో.

అందరి మొగాళ్ళ లాగానే అంజలి ఇంట్లోనే ఉండాలి, సినిమాలు వద్దు అంటూ కండిషన్స్ పెట్టాడు.సినిమాల్లో నటించాలి, హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని అనుకున్న అంజలి కి తన ప్రేమ అడ్డుగా మారింది.

Telugu Anjali, Godavari, Jai, Jhansi Web, Rajolu, Tollywood, Untoldstory-Telugu

ఇక సినిమాలు మాత్రమే కావాలనుకున్న అంజలి వెయిట్ లాస్ అవ్వాలని నిర్ణయించుకోగానే జై ఆమెను దూరం పెట్టాడు.దాంతో ప్రేమను కూడా త్యాగం చేసి అంజలి కెరీర్ పై ఫోకస్ చేసింది.మొదట్లో కొంచం కష్టం అయినా ఆ తర్వాత ఆమెలోని నాటికీ తమిళ్, తెలుగు ఇండస్ట్రీ లు సలాం కొట్టాయి.ప్రస్తుతం ఝాన్సీ వంటి చల్లేంజింగ్ వెబ్ సిరీస్ లో నటించిన అంజలి సింగిల్ హ్యాండ్ తో ఆ సిరీస్ హిట్ అవ్వడం లో ప్రముఖ పాత్ర పోషించింది.

ఈ మధ్య కాలంలో వకీల్ సాబ్, నిశ్శబ్ద్ సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఇలా ఒకప్పుడు కుటుంబాన్ని, ఆ తర్వాత ప్రేమను వద్దనుకుని కెరీర్ లో గెలుపు సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube